Jallikattu: జల్లికట్టుకు గ్రీన్ సిగ్నల్.. కానీ ఆ గీత దాటొద్దన్న తమిళనాడు సర్కార్..

|

Jan 10, 2022 | 6:09 PM

జల్లికట్టు ఆటకు తమిళనాడు సర్కార్ పచ్చ జెండా ఊపింది. ప్రతి ఏటా నిర్వహించే జల్లికట్టుకు ఈ ఏడాది కూడా అనుమతిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ నిర్ణయం తీసుకున్నారు. అయితే, కొవిడ్‌  మార్గదర్శకాలను..

Jallikattu: జల్లికట్టుకు గ్రీన్ సిగ్నల్.. కానీ ఆ గీత దాటొద్దన్న తమిళనాడు సర్కార్..
Jallikattu
Follow us on

జల్లికట్టు ఆటకు తమిళనాడు సర్కార్ పచ్చ జెండా ఊపింది. ప్రతి ఏటా నిర్వహించే జల్లికట్టుకు ఈ ఏడాది కూడా అనుమతిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ నిర్ణయం తీసుకున్నారు. అయితే, కొవిడ్‌  మార్గదర్శకాలను తప్పకుండా అనుసరించాలని పేర్కొన్నారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో జల్లికట్టు పోటీలో పాల్గొనే ఆటగాళ్లు, ప్రేక్షకులు మాత్రం తప్పకుండా 2 డోస్‌ల కరోనా వ్యాక్సిన్‌ తీసుకుని ఉండాలని ప్రకటించారు. ప్రతి ఏటా జల్లికట్టుపై వివాదం, హింసాత్మకమైన ఈ పోటీలను నిషేధించాలని కొందరి డిమాండ్‌ కొనసాగుతుండేది.. ఇలాంటి వాటికి చెక్ పెడుతూ స్వయంగా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. కాగా, మధురై జిల్లాలో ఈనెల 14 నుంచి జల్లికట్టు పోటీలు ప్రారంభంకానున్నాయి.

కొవిడ్‌ నేపథ్యంలో ప్రభుత్వ మార్గదర్శకాలు…

జల్లికట్టు పోటీల్లో పాల్గొనేందుకు కేవలం 300 మందికి మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపంది. పోటీలను తిలకించేందుకు 150 మంది ప్రేక్షకులు లేదా 50 శాతం సిట్టింగ్‌ సామర్ధానికి మించకూడాదని వెల్లడించింది తమిళనాడు సర్కార్. పోటీలకు వచ్చే వారు పూర్తిగా రెండుడోసుల వ్యాక్సిన్‌ తీసుకోవాలని పేర్కొంది. పోటీల ప్రారంభానికి 48 గంటల ముందు కోవిడ్‌ నెగిటివ్‌ సర్టిఫికెట్‌ వెంట తీసుకుని రావాలని సూచించింది.

జల్లికట్టు వివాదాలు..

దీన్ని నిషేధించాలని చాలాకాలంగా ఆందోళన చేస్తున్నాయి ఎనిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా,
పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ (PETA) సంస్థలు. అంతే కాదు గతంలో నిషేధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. పశువుల పట్ల క్రూరత్వాన్ని ప్రదర్శించే ఇలాంటి క్రీడలు నిషేధించాలని వివిధ హక్కుల సంఘాల డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ ఆటపై 2014లోనే సుప్రీంకోర్టు నిషేధం విధించినా తమిళ ప్రజల నిరసనలతో.. కేంద్రం ప్రభుత్వం ఒక ఆర్డిరెన్స్‌ తీసుకొచ్చి జల్లికట్టుకు అనుమతులు ఇచ్చింది. అప్పటి నుంచీ ప్రతి ఏటా ఈ ఆటపై వివాదం రేగుతూనే ఉంది. కానీ ఆట మాత్రం ఆగకపోవడం లేదు. 2017లో మరోసారి కోర్టుకెక్కిన జల్లికట్టు అనుమతుల వివాదం.. అదే ఏడాది ఎండ్ కార్డ్ పడింది. అప్పటి నుంచీ ఈ ఆటకు జాతీయ, అంతర్జాతీయ మీడియాలో మరింత ప్రాచుర్యం లభిస్తోంది. అయితే.. 2021 సెప్టెంబర్‌లో మద్రాస్‌ హైకోర్టు ఇచ్చిన మరో తీర్పు పెద్ద సమస్యకు చెక్ పెట్టినట్లైంది.  జల్లికట్టు క్రీడలో దేశీయ జాతుల ఎడ్లను మాత్రమే అనుమతించాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది.

ఇవి కూడా చదవండి: Punjab Assembly Election 2022: వీటి చుట్టే తిరుగుతున్న పంజాబ్ ఎన్నికలు.. ఆశలన్నీ కింగ్ మేకర్‌పైనే..

Flamingos: ఫ్లెమింగోలు ఒంటికాలి జపం ఎందుకు చేస్తాయో తెలుసా.. దీని వెనుక ఓ సైన్స్..