కుక్కకాటుకు చెప్పుదెబ్బ సంగతేమిటో కానీ.. చిత్తకార్తికుక్కల్లాంటి మనుషులకు మాత్రం చెప్పుదెబ్బలు అవసరం.. అమ్మాయిలు కనిపిస్తే చాలు వికారపు పనులు చేసేవాళ్లకు నాలుగు తగలాల్సిందే..! ఈ ఉపోద్ఘాతం ఎందుక్కానీ… తమిళనాడుకు చెందిన ఇంజరీనింగ్ విద్యార్థినులు ఓ అద్భుతమైన ఎలక్ట్రానిక్ పరికరాన్ని తయారు చేశారు.. దాన్ని మహిళలు తమ చెప్పులో పెట్టుకుంటే చాలు…ఇక ఏ ఆకతాయి హద్దు మీరడు.. సపోజ్ మీరాడే అనుకుందాం… సయ్యిమంటూ అలారం మోగుతుంది.. ఆ మోతను కూడా లెక్కచేయకుండా తాకేందుకు ప్రయత్నించాడే అనుకుందాం! సట్‌మంటూ షాక్ కొడుతుంది… తంజావూరుకు చెందిన అమృతగణేశ్ అనే ఇంజనీరింగ్ పట్టభద్రురాలు ఈ పరికరాన్ని రూపొందించారు. ఈమెకు సంగీత, సౌందర్య, వినోదిని, మణికంఠన్‌లు కూడా చేదోడువాదోడుగా నిలిచారు.. వేధింపుల నుంచి తమను తాము కాపాడుకునేందుకు వైర్‌లెస్ రిసీవర్, బ్యాటరీ, ఎలక్ట్రోడులను వినియోగించి చెప్పులో ఇమిడేలా ఓ పరికరాన్ని తయారు చేశారు.. ఎవడైనా ఏదైనా వెధవ పని చేస్తే చాలు… వారు వేసుకున్న చెప్పుల్లోని ఆ పరికరం నుంచి వంద మీటర్ల వరకు వినిపించేలా అలారం మోగుతుంది. అంతేకాకుండా ఆ చెప్పును వాడికి తాకిస్తే షాక్ తగులుతుంది.. ఈ పరికరానికి ఛార్జింగ్ అవసరం లేదు.. నడిచేటప్పుడు ఆటోమాటిక్‌గా రీఛార్జ్ అవుతుంది.. చెప్పుల్లోనే కాదు.. సెల్‌ఫోన్, రిస్ట్‌వాచ్‌లలో కూడా ఈ పరికరాన్ని అమర్చుకోవచ్చు.