Tamil Nadu: టార్గెట్ డిప్యూటీ సీఎం కుర్చీ.. తమిళ పాలిటిక్స్‌లో K-G-F మాస్టర్ స్కెచ్..

ఆ ఓటు బ్యాంకు సైజు 65 లక్షలు. వాళ్లు అడుగుతున్నది డిప్యూటీ సీఎం కుర్చీ. ఏ కూటమి ఒప్పుకుంటే ఆ కూటమికి జైకొడతారట. తమిళనాడు ఎన్నికల్లో అక్కడి పార్టీలకు తెలుగువారిచ్చిన బంపరాఫర్ ఇది. అరవ గడ్డపై KGF పేరుతో వినిపిస్తున్న కొత్త సొండ్ ఇది. ఏమిటా KGF... ఏమా కథ? తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి..

Tamil Nadu: టార్గెట్ డిప్యూటీ సీఎం కుర్చీ.. తమిళ పాలిటిక్స్‌లో K-G-F మాస్టర్ స్కెచ్..
Tamil Nadu Elections

Updated on: Jan 31, 2026 | 9:22 AM

మరో రెండుమూడు నెలల్లో తమిళనాట అసెంబ్లీ దంగల్. ఇప్పటికే మూడు కూటముల మధ్య కిక్‌బాక్సింగ్ మొదలైంది. మానిఫెస్టోలు కూడా ప్రింటైపోయి ఏ ఒక్క ఓటుబ్యాంకునూ తేలిగ్గా తీసుకోకూడదన్న కమిట్‌మెంట్‌తో ఉన్నాయి. ఇదే గ్యాప్‌లో అరవ రాజకీయాలపై ఫోకస్ చేసింది కమ్మ సామాజిక వర్గం.. ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల 10 లక్షల మంది కమ్మ సామాజికవర్గానికి చెందినవారున్నారు. ఇది, దేశ జనాభాలో 1.5 శాతం కంటే ఎక్కువ. తమిళనాడులో అత్యధికంగా 65 లక్షల కమ్మ జనాభా ఉంది. అందుకే, అక్కడి రాజకీయాల్లో సత్తా చాటడానికి ఓ అడుగు ముందుకేసినట్టుంది కమ్మ సెక్టార్. ఇందులో భాగంగా ఏర్పాటైందే KGF… కమ్మ గ్లోబల్ ఫెడరేషన్. ప్రపంచవ్యాప్తంగా కమ్మ, కమ్మనాయుళ్లు, చౌదరి వర్గాల ఐక్యతను సాధించడమే KGF లక్ష్యమట.

రాజకీయంగా పైచేయి సాధించాలన్న ఆలోచనతో ఫిబ్రవరి 8న శ్రీపెరంబుదూర్ వేదికగా భారీస్థాయిలో కమ్మ మహానాడు నిర్వహించాలన్నది KGF ప్లాన్. 2024లో హైదరాబాద్‌లో వరల్డ్ కమ్మ సమ్మిట్‌ పేరుతో జరిగిన సభకు తెలంగాణ ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రీపెరంబదూర్ సభకు మాత్రం తమిళనాడు లీడర్లను మాత్రమే ఆహ్వానించబోతోంది KGF. ఎవరు హాజరౌతారనేది సస్పెన్స్‌.

తమిళనాడు రాజకీయాల్లో కమ్మ సామాజికవర్గానికంటూ ఒక ప్రత్యేకత ఉంది. బొల్లినేని మునుస్వామినాయుడు, జీ.డి. నాయుడు, వైగో వంటి ప్రముఖులు కమ్మవారే. అందుకే, కనీసం 30 మంది కమ్మ ఎమ్మెల్యేల్ని గెలిపించుకుని తమిళనాడు అసెంబ్లీలో ఉనికిని బలంగా చాటుకోవాలన్నది KGF టార్గెట్టట. వీలైతే డిప్యూటీ సీఎం పదవిని డిమాండ్ చేసే దిశగా జరుగుతోంది కసరత్తు. సాంస్కృతికంగా, నైపుణ్యాలపరంగా, వ్యాపారం, సామాజిక బాధ్యత.. ఇలా అన్ని అంశాల్లో ముందువరుసలో ఉన్నాం, రాజకీయాల్లో మాత్రం ఎందుకు వెనకబడాలి.. అనేది కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ లాజిక్..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..