Senthil Balaji ED Raid: మనీలాండరింగ్‌ కేసులో తమిళనాడు మంత్రి సెంథిల్‌ బాలాజీ అరెస్ట్..

ED Raid: మంగళవారం మధ్యాహ్నం 2 గంటలనుంచి సచివాలయంలోని ఆయన కార్యాలయంలో, కోయంబత్తూర్, కడూర్ నివాసాల్లో ఈడీ అధికారులు సోదాలు చేశారు. 18 గంటలపాటు మంత్రి ఇంట్లో ప్రశ్నించిన ఈడీ అధికారులు ఆ తర్వాత మంత్రుని అరెస్టు చేసినట్లు ప్రకటించారు. ఆయనను భారీ స్థాయిలో మనీ లాండరింగ్‌కు

Senthil Balaji ED Raid: మనీలాండరింగ్‌ కేసులో తమిళనాడు మంత్రి సెంథిల్‌ బాలాజీ అరెస్ట్..
Senthil Balaji Ed Raid

Updated on: Jun 14, 2023 | 7:39 AM

తమిళనాడు విద్యుత్ శాఖా మంత్రిగా పనిచేస్తున్న సెంథిల్ బాలాజీ. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలనుంచి సచివాలయంలోని ఆయన కార్యాలయంలో, కోయంబత్తూర్, కడూర్ నివాసాల్లో ఈడీ అధికారులు సోదాలు చేశారు. 18 గంటలపాటు మంత్రి ఇంట్లో ప్రశ్నించిన ఈడీ అధికారులు ఆ తర్వాత మంత్రుని అరెస్టు చేసినట్లు ప్రకటించారు. ఆయనను భారీ స్థాయిలో మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లుగా అధారాలు ఈడీకి లభించడంతో ఈ ఉదయం ఆయనను అరెస్ట్ చేస్తున్నట్లు తెలిపారు. ఆ వార్త విన్న వెంటనే చాతినొప్పి అంటూ ఒక్కసారిగా కూలిపోయారు మంత్రి సెంథిల్ బాలాజీ. వెంటనే ఆయనను స్థానికంగా ఉన్న ప్రభుత్వాసుపత్రికి తరలించి, పరీక్షలు చేస్తున్నారు. మంత్రిని అదుపులోకి తీసుకుని ఢిల్లీకి తరలించే ఆలోచనలో ఉన్నారు.

తమిళనాడు చీఫ్ సెక్రటేరియట్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ సోదాలు, కరూర్ నివాసంలో నిర్వహించిన సోదాలు కూడా పూర్తయ్యాయి. కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తీసుకువెళుతుండగా ఛాతీలో నొప్పి రావడంతో చెన్నైలోని ఒమంతురార్ ప్రభుత్వ ఆసుపత్రిలోని అత్యవసర విభాగంలో ఆయనను చేర్చారు. మంత్రులు ఉద‌య‌నిధి స్టాలిన్, మ‌ సుబ్ర‌మ‌ణ్యం, ఎవ వేలు, రఘుప‌తి, శేఖ‌ర్ బాబు త‌దిత‌రులు ఆసుప‌త్రికి వెళ్లి ప‌రామర్శించారు.

ఈడీ చర్యకు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు మంత్రి మద్దతుదారులు అక్కడికి చేరుకున్నారు. ఆ సమయంలో కారులో పడుకుని నొప్పితో ఏడుస్తూ కనిపించారు.

ఆ వీడియోను ఇక్కడ చూడండి..


మంగళవారం, తమిళనాడు సిఎం ఎంకె స్టాలిన్ మంగళవారం రాష్ట్ర మంత్రి సెంథిల్ బాలాజీ నివాసం, కార్యాలయంలో ఇడి దాడులను ఖండించారు. బిజెపి ‘బ్యాక్‌డోర్ బెదిరింపు’లో మునిగిపోతోందని అన్నారు. బెదిరింపు రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని సీఎం అన్నారు. మనీలాండరింగ్ విచారణలో భాగంగా తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి వీ సెంథిల్ బాలాజీ నివాసంపై ఈడీ దాడులు చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం