Breaking News: తాజ్ మహల్‌కు బాంబు బెదిరింపు కాల్.. బాంబ్ స్క్వాడ్ సాయంతో పోలీసుల తనిఖీలు

|

Mar 04, 2021 | 11:46 AM

తాజ్ మహల్‌ వద్ద బాంబు పెట్టినట్లు ఈ రోజు ఉదయం ఉత్తర ప్రదేశ్ పోలీసుల హెల్ప్‌లైన్ నంబర్‌కు గురువారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. దీంతో వెంటనే అలర్టైన పోలీసులు..

Breaking News:  తాజ్ మహల్‌కు బాంబు బెదిరింపు కాల్.. బాంబ్ స్క్వాడ్ సాయంతో పోలీసుల తనిఖీలు
Follow us on

తాజ్ మహల్‌ వద్ద బాంబు పెట్టినట్లు  ఉత్తర ప్రదేశ్ పోలీసుల హెల్ప్‌లైన్ నంబర్‌కు గురువారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. దీంతో వెంటనే అలర్టైన పోలీసులు.. అక్కడికి చేరుకుని పర్యాటకులకు ఆ ప్రదేశం నుంచి పంపించివేశారు. పరిసరాలను అదుపులోకి తీసుకుని బాంబ్ స్క్వాడ్ సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. బాంబు బెదిరింపు నేపథ్యంలో అధికారులు చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా తనిఖీల ద్వారా నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు పేలుడు పదార్థాలు ఏవీ కనుగొనలేదని ఎడిజి ఆగ్రా జోన్ రాజీవ్ కృష్ణ తెలిపారు.

“తాజ్ మహల్ వద్ద ఒక బాంబు పెట్టామని, అది త్వరలోనే పేలిపోతుందని ఒక వ్యక్తి  నుంచి కాల్ వచ్చినట్లు కంట్రోల్ రూమ్ నుంచి సమాచారం అందింది. తాజ్ మహల్ చుట్టూ భద్రతా తనిఖీలు జరుగుతున్నాయి” అని శివ రామ్ యాదవ్, ఎస్పీ (ప్రోటోకాల్)  తెలిపారు. ఆగ్రా సైనిక నియామకంలో తాను వివక్షకు గురయ్యానని.. అందుకే ఈ పని చేసినట్లు సదరు వ్యక్తి చెప్పినట్లు ఎస్పీ  వెల్లడించారు.

Also Read:

క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. స్టార్ ఆల్‌రౌండర్ జడేజా తిరిగి ట్రాక్‌లోకి వచ్చేశాడు

మీరు రేషన్ పంపిణీలో ఇబ్బందులు ఎదుర్కుంటున్నారా..? ఈ నంబర్ల ద్వారా ఫిర్యాదు చేయండి