నూతన సంవత్సరంలోకి అడుగిడిన రోజున దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. స్విగ్గీ డెలివరీ బాయ్ ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు 500 మీటర్ల మేర లాక్కెళ్లింది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. తాజాగా దేశ రాజధానిలో మహిళను కారుతో ఢీకొట్టి 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన నేపథ్యంలో ఈ సంఘటన వెలుగు చూసింది. వివరాలోకెళ్తే..
స్విగ్గీ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న కౌశల్ యాదవ్ ఆదివారం రాత్రి తన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. నోయిడాలోని సెక్టార్ 14లో ఫ్లైఓవర్ దగ్గర అతని ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టింది. ఆ తర్వాత బాధితుడిని అర కిలోమీటరు వరకు కారు ఈడ్చుకెళ్లింది. అనంతరం కారు డ్రైవర్ గుడి సమీపంలో కారును వదిలేసి పరారయ్యాడు. ఈ ఘటనలో కౌశల్ యాదవ్ మృతి చెందాడు. అతని మృతదేహం దారుణంగా నలిగిపోయింది. స్థానికులు గమనించి మృతుడి వద్ద ఉన్న ఫోన్ ద్వారా అతని సోదరుడికి సమాచారం అందించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని నిందితుడి ఆచూకీ కోసం ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై స్విగ్గీ స్పందిస్తూ.. కౌశల్ యాదవ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసింది. అతని కుటుంబ సభ్యులకు భీమా పరిహారం అందిచడంతోపాటు పోలీసులకు చట్టపరమైన సహాయాన్ని అందిస్తామని పేర్కొంది.
NOIDA
दिल्ली की तर्ज पर नोएडा के सेक्टर 14A में न्यू ईयर की रात 1 बजे हुई घटना, डिलीवरी बॉय को मारी टक्कर, खींच कर 14A से शनि मंदिर पर ले गया कार चालक
डिलीवरी बॉय की हुई मौत
PS PHASE 1@noidapolice@CP_Noida @Uppolice pic.twitter.com/i6H6gbR4IR— हिंदी News Now (@Hindi_News_Now) January 4, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.