ఇలానే కొనసాగిస్తే ఆత్మహత్య చేసుకుంటా: స్వప్న సురేష్

| Edited By:

Jul 09, 2020 | 10:04 PM

కేరళ రాష్ట్రంలో వెలుగుచూసిన బంగారం స్మగ్లింగ్ వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని ఐటీ శాఖ మాజీ ఉద్యోగిని స్వప్న సురేష్ వెల్లడించారు.

ఇలానే కొనసాగిస్తే ఆత్మహత్య చేసుకుంటా: స్వప్న సురేష్
Follow us on

కేరళ రాష్ట్రంలో వెలుగుచూసిన బంగారం స్మగ్లింగ్ వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని ఐటీ శాఖ మాజీ ఉద్యోగిని స్వప్న సురేష్ వెల్లడించారు. బంగారం అక్రమ రవాణాకు, తనకు ఎలాంటి సంబంధం లేదని ముందస్తు బెయిల్ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఓ ఛానెల్ విడుదల చేసిన ఆడియో క్లిప్‌లో.. రాజకీయ ప్రయోజనాల కోసం ఈ కేసులో తనను ఇరికించాలని చూస్తున్నారని స్వప్న వెల్లడించారు. ఇక మీడియాలో తన గురించి లేనిపోని విషయాలు వెల్లడిస్తే ఆత్మహత్య చేసుకుంటానని స్వప్న బెదిరించారు.

”డిప్లమాటిక్‌ బ్యాగేజీల ద్వారా బంగారం అక్రమ రవాణా అవుతున్న విషయంలో నాకు ప్రమేయం లేదు. బ్యాగేజీ వచ్చిన మరుసటి రోజు డిప్లమాటిక్‌ నుంచి ఓ వ్యక్తి ఫోన్ చేసి ఎందుకు ఆలస్యమైందో వివరించారు. ఆ తరువాత కస్టమ్స్‌ ఏసీ రామమూర్తికి ఫోన్ చేసి ఆలస్యం ఎందుకు అయ్యిందో అడిగాను. ఆ విషయాన్ని తాను చూసుకుంటానని ఆయన అన్నారు ”అని స్పప్న వివరించారు. ”కాన్సులర్‌లో సెక్రటరీగా నేను పనిచేసేదాన్ని. అక్కడ నా వ్యక్తిగత విషయాల కోసం నేను ఎవ్వరితో మాట్లాడలేదు. అయినా నేను ఇప్పుడు అక్కడ పనిచేసే ఉద్యోగిని కాదు. అయితే వారి పనుల కోసం నేను సహాయం చేసే దాన్ని. అయినా స్పేస్‌ పార్క్‌లో స్టాఫ్‌ అయిన నేను ఇలాంటి పనులు ఎందుకు చేస్తాను” అని స్వప్న ప్రశ్నించారు.

ఇక పెద్దవారితో తాను జల్సాలు చేసేదాన్నంటూ కొన్ని కథనాలు వస్తున్నాయని అవన్నీ నిరాధారమైనవని స్వప్న అన్నారు. నేనేం దీన్ని నుంచి పారిపోవడం లేదని, ఈ స్మగ్లింగ్ వెనకాల ఎవరున్నారో కనుక్కోవాలని స్వప్న డిమాండ్ చేశౄరు. కాగా ఈ కేసులో ఇప్పటికే కేరళ సీఎం పినరయి విజయన్ ప్రిన్సిపల్ కార్యదర్శి, రాష్ట్ర ఐటీ సెక్రటరీ ఎం.శివశంకర్‌ ను విధుల నుంచి తొలగించిన విషయం తెలిసిందే.