Viral Video: నీటిలో తేలుతున్న శవం.. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు ఫ్యూజులు ఔట్.. ఏం జరిగిదంటే..

|

Sep 30, 2021 | 6:12 PM

కరోనా వల్ల మూతపడిన పర్యాటక ప్రదేశాలు ఒక్కొక్కటిగా తెరుచుకుంటున్నాయి. చాలా రోజుల తర్వాత పర్యాటక ప్రాంతాలు పునప్రారంభించటంతో సందర్శకుల తాకిడి పెరిగింది...

Viral Video: నీటిలో తేలుతున్న శవం.. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు ఫ్యూజులు ఔట్.. ఏం జరిగిదంటే..
Swamy
Follow us on

కరోనా వల్ల మూతపడిన పర్యాటక ప్రదేశాలు ఒక్కొక్కటిగా తెరుచుకుంటున్నాయి. చాలా రోజుల తర్వాత పర్యాటక ప్రాంతాలు పునప్రారంభించటంతో సందర్శకుల తాకిడి పెరిగింది. ఇలానే కొందరు సందర్శాకులు ఓ పర్యాటక ప్రాంతానికి వెళ్లారు. ఎంజాయి చేశారు. బోటింగ్ చేద్దామని నీటిలోకి దిగి కాస్త దూరం వెళ్లగానే వారికి నీటిలో శవం తేలియడుతూ కనిపించింది. భయపడిన వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ మృతదేహం ఎవరిదా అనుకుంటూ అక్కడి చేరుకున్నారు పోలీసులు. శవం వద్దకు వెళ్లేసరికి వారు షాక్‎కు గురయ్యారు. ఎందుకంటే అక్కడ ఉన్నది శవం కాదు మనిషే అని తెలిసింది. ఈ ఘటన తమినాళడులో జరిగింది. పూర్తి విరాల్లోకి వెళ్తే…

తమిళనాడులో లాక్‎డౌన్ నిబంధనలు నుంచి పర్యాటక స్థలాలకు మినహాయింపు రావటంతో ఊటీ, కొడైకెనాల్ లాంటి పర్యాటక ప్రదేశాల్లోకి సందర్శకులను అనుమతిస్తున్నారు. దిండిగల్ జిల్లా కొడైకెనాల్‎లో బోటింగ్‎కు అధికారులు అనుమతి ఇచ్చారు. ఈ క్రమంలో కొడైకెనాల్ విహారయాత్రకు వచ్చినవారు బోటింగ్ చేస్తుండగా ఒక్కసారిగా మనిషి శవం నీటిలో ఉన్నట్టు కనబడటంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు ఒక్కసారిగా షాక్కు‎ గురయ్యారు. స్థానికంగా ఉన్న ముత్తువేల్ స్వామిజి మద్యం మత్తులో నదిలో యోగాసనాలు వేస్తూ ఆలా చలనం లేకుండా ఉన్నాడని తెలిసింది. స్వామిజిని నీటిలో నుంచి బయటకు రావాలని పోలీసులు కోరారు. పోలీసు చెప్పింది పట్టించుకోకుండా స్వామీ అలానే శవాసనం వేసుకొని ఉన్నాడు. చిర్రెత్తుకొచ్చిన పోలీసులు స్వామిజిని బయటకు లాక్కొచ్చారు. మద్యం మత్తులో ఉన్న స్వామీజీని మందిలించి వదిలేశారు.

Read Also.. India Survey: దేశంలో పట్టణజీవులను కలవరపెడుతున్న ఆ రెండు సమస్యలు.. తాజా సర్వేలో ఆసక్తికర అంశాలు