మహిళా జైల్లో రియా ! 14 రోజులు గడుపుతుందా ?

సుశాంత్ కేసులో అరెస్టయిన రియా చక్రవర్తిని ముంబైలోని బైకుల్లా జైలుకు తరలించారు. ముంబైలో ఇది ఒక్కటే మహిళా జైలు. షీనా బోరా హత్య కేసు నిందితురాలు ఇంద్రాణి ముఖర్జియా, కోరేగావ్-బీమా కేసులో అరెస్టయిన...

మహిళా జైల్లో రియా ! 14 రోజులు గడుపుతుందా ?

Edited By:

Updated on: Sep 09, 2020 | 3:03 PM

సుశాంత్ కేసులో అరెస్టయిన రియా చక్రవర్తిని ముంబైలోని బైకుల్లా జైలుకు తరలించారు. ముంబైలో ఇది ఒక్కటే మహిళా జైలు. షీనా బోరా హత్య కేసు నిందితురాలు ఇంద్రాణి ముఖర్జియా, కోరేగావ్-బీమా కేసులో అరెస్టయిన యాక్టివిస్ట్ సుధా భరద్వాజ్ వంటి మహిళలు ఇక్కడ శిక్ష అనుభవిస్తున్నారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఈ జైలుకు ఉంది. రియాకు జైలు శిక్షపై బాలీవుడ్ చాలావరకు మౌనంగా ఉన్నప్పటికీ పలువురు సోషల్ మీడియాలో ఆమెకు మద్దతుగా నిలిచారు. బెయిల్ కోసం రియా బుధవారం సెషన్స్ కోర్టును ఆశ్రయించనుంది.