అయోధ్యలో అపురూప ఘట్టం.. బాల రాముడి నుదిటిపై సూర్య తిలకం దిద్దిన వేళ..

ఈ సంప్రదాయం రాముడి జన్మ సమయాన్ని సూచించే మధ్యాహ్నం 12 గంటలకు జరిగింది. కాగా, ఆలయంలో జరిగిన అద్భుతాన్ని యావత్‌ దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రామ భక్తులు తిలకించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ఆలయ ట్రస్ట్‌. ఈ అద్భుత ఘట్టాన్ని చూసేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రత్యక్ష ప్రసారం ఏర్పాటు చేసింది. ఈ సంఘటన భక్తులను ఆకర్షించింది.

అయోధ్యలో అపురూప ఘట్టం.. బాల రాముడి నుదిటిపై సూర్య తిలకం దిద్దిన వేళ..
Surya Tilak

Updated on: Apr 06, 2025 | 12:47 PM

శ్రీరాముడి జన్మస్థలంగా ప్రసిద్ధిగాంచిన అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. అయోధ్యలో కొలువుదీరిని బాలరాముడి సన్నిధిలో భక్తుల కోలాహలం నెలకింది. శ్రీరామ నవమి సందర్భంగా అయోధ్య లోని శ్రీ రామ జన్మభూమి మందిరంలో జరిగిన ఆ అపురూప దృశ్యాన్ని చూసిన భక్తులు పరవశించిపోయారు..శ్రీరామనవమి తిథి రోజున సరిగ్గా మధ్యాహ్నం 12గంటల సమయంలో ఆ బాల రాముడి నుదిటిపై సూర్య తిలకం పడింది. ఈ అపూర్వ సన్నివేశం నిజంగానే అద్భుతంగా కనిపించింది భక్తులకు మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలు బాల రాముడి నుదిటిపై ప్రకాశిస్తూ.. సుమారు 4 నిమిషాల పాటు అలాగే దర్శనమిచ్చింది. ఇదంతా చూసిన భక్తులు ఆనందంతో పాటు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

అయితే ఎన్నో సంవత్సరాల పోరాటాల తర్వాత ప్రతిష్టాత్మకంగా నిర్మించబడింది అయోధ్య దేవాలయం.. ప్రతీ శ్రీరామ నవమి రోజున ఇక్కడ బాలరాముడి నుదిటిపై నేరుగా సూర్యకిరణాలు తిలకంగా పడేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సంఘటన కోసం ఆలయంలో అద్దాలు, లెన్స్‌లతో కూడిన ప్రత్యేక సాంకేతిక వ్యవస్థ ను ఉపయోగించారు. దీని ద్వారా సూర్య కాంతి గర్భగుడిలో విగ్రహంపై ఖచ్చితంగా ప్రసరిస్తుంది. ఈ సంప్రదాయం రాముడి జన్మ సమయాన్ని సూచించే మధ్యాహ్నం 12 గంటలకు జరిగింది. ఇది ఇక్ష్వాకు వంశానికి కులదైవమైన సూర్య భగవానుడితో రాముడి సంబంధాన్ని ప్రతిబింబిస్తుందని భక్తుల విశ్వాసం.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

కాగా, ఆలయంలో జరిగిన అద్భుతాన్ని యావత్‌ దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రామ భక్తులు తిలకించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ఆలయ ట్రస్ట్‌. ఈ అద్భుత ఘట్టాన్ని చూసేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రత్యక్ష ప్రసారం ఏర్పాటు చేసింది. ఈ సంఘటన భక్తులను ఆకర్షించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..