ఢిల్లీ శివార్ల లోని నోయిడా హౌసింగ్ సోసైటీలో మహిళపై దాడి చేసిన బీజేపీ నేత శ్రీకాంత్ త్యాగిని యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. మీరట్‌లో త్యాగిని అదుపు లోకి తీసుకున్నారు. హౌసింగ్ సోసైట్‌లో ఆక్రమణలను ప్రశ్నించిన మహిళపై దాడికి పాల్పడ్డాడు త్యాగి. గత నాలుగు రోజుల నుంచి పరారీలో ఉన్న రౌడీ లీడర్‌ను ఎట్టకేలకు అదుపు లోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెల్లడించాడు శ్రీకాంత్ త్యాగి . తన కారుపై ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్ సమాజ్‌వాదీ పార్టీ నేత స్వామి ప్రసాద్ మౌర్య ఇచ్చారని తెలిపారు. నోయిడా లోని త్యాగి నివాసం నుంచి పోలీసులు మూడు కార్లను సీజ్ చేశారు. ఓ కారుపై ఎమ్మెల్యే స్టిక్కర్ ఉండగా , మరో కారుపై యూపీ ప్రభుత్వ నెంబర్ ప్లేట్ ఉంది.
త్యాగికి గతంలో కూడా నేరచరిత్ర ఉన్నట్టు గుర్తించారు. అతడిపై 9 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. భార్యతో , తన లాయర్‌తో ఫోన్లో మాట్లాడుతుండగా కాల్‌డేటా ఆధారంగా త్యాగిని పోలీసులు అరెస్ట్ చేశారు. నోయిడా హౌసింగ్ సోసైటీలో త్యాగి నివాసం లోని ఆక్రమణలను పోలీసులు బుల్‌డోజర్లతో కూల్చేశారు
నాలుగు రోజుల నుంచి శ్రీకాంత్ త్యాగి తన స్థావరాలను మారుస్తునట్టు పోలీసులు గుర్తించారు. చివరకు మీరట్‌లో అతడు చిక్కాడు. శ్రీకాంత్ త్యాగితో తమకు సంబంధం లేదని అతడి సామాజిక వర్గం నేతలు ప్రకటించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం