కోవిడ్ పై తప్పుడు ప్రచారం చేస్తే కోర్టు ధిక్కారమే, సుప్రీంకోర్టు వార్నింగ్, సమాచారం సరైనదైతే ఆంక్షలుండవని వెల్లడి

| Edited By: Phani CH

Apr 30, 2021 | 5:28 PM

దేశ వ్యాప్తంగా కోవిడ్ పరిస్థితిపై దాఖలైన కేసుపై తనకు తానుగా విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. కోవిడ్ మీద తప్పుడు ప్రచారం చేస్తే అది కోర్టు ధిక్కారమే అవుతుందని హెచ్చరించింది.

కోవిడ్ పై తప్పుడు ప్రచారం చేస్తే కోర్టు ధిక్కారమే, సుప్రీంకోర్టు వార్నింగ్,  సమాచారం సరైనదైతే ఆంక్షలుండవని వెల్లడి
Supreme Court Warns Against Clampdown On Dissemination
Follow us on

దేశ వ్యాప్తంగా కోవిడ్ పరిస్థితిపై దాఖలైన కేసుపై తనకు తానుగా విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. కోవిడ్ మీద తప్పుడు ప్రచారం చేస్తే అది కోర్టు ధిక్కారమే అవుతుందని హెచ్చరించింది. ప్రజలు సోషల్ మీడియా ద్వారా తమ ఆందోళనను,  సమస్యలను వివరించవచ్చునని, దీనిపై ఆంక్షలు లేవని స్పష్టం చేసింది. న్యాయమూర్తులు డీ.వై.చంద్రచూడ్, ఎల్.నాగేశ్వర రావు, రవీంద్ర భట్ లతో కూడిన బెంచ్..దేశంలో ఆక్సిజన్, మందుల సరఫరా , ఇతర అంశాలపై దాఖలైన పిటిషన్ ను విచారించింది. కోవిడ్ వ్యాక్సిన్ కి సంబంధించి జాతీయ టీకా కార్యక్రమ పాలసీని (నేషనల్ ఇమ్యునైజేషన్ పాలసీని) కేంద్రం  ఎందుకు పాటించదని జస్టిస్ చంద్రచూడ్ ప్రశ్నించారు. వంద శాతం కోవిడ్  19 వ్యాక్సిన్ డోసులను కేంద్ర ప్రభుత్వం ఎందుకు కొనుగోలు చేయడంలేదని అన్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రజలు తమఇబ్బందులను వివరిస్తే అది తప్పుడు సమాచారంకాబోదు.. దీనిపై నిషేధం లేదు అన్నారు. ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉందని, ఈ అంశాన్ని తాము పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు. హాస్టళ్లు, ఆలయాలు, చర్చీలు, ఇతర ప్రార్థనా స్థలాలను కోవిడ్-19 సెంటర్లుగా మార్చవచ్చునని బెంచ్ అభిప్రాయపడింది.

డాక్టర్లు, హెల్త్ కేర్ వర్కర్లు వంటి వైద్య సిబ్బంది కూడా ఆసుపత్రుల్లో బెడ్స్ కి నోచుకోలేకపోతున్నారని కోర్టు విచారం వ్యక్తం చేసింది. 70 ఏళ్లుగా దేశంలో మెడికల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ పరిస్థితి ఇలా ఉందని బెంచ్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిస్థితి ఎప్పుడు మారుతుందని తనకు తానుగా ప్రశ్నించుకుంది. మనం ఇప్పుడు హ్యూమన్ క్రైసిస్ పరిస్థితిలో . ఉన్నాం అని వ్యాఖ్యానించింది.  దేశంలోని పేదలకు, మధ్యతరగతి  వర్గాలకు  వైద్యం ఎప్పడు అందుతుందని కూడా అత్యున్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. కాగా-కోవిడ్ పై తప్పుడు సమాచారం. లేదా రెచ్చగొట్టే విధంగా ఉండే ట్వీట్స్ ను బ్లాక్ చేయాల్సిందిగా కేంద్రం ట్విటర్ ను కోరిన విషయం ఈ సందర్భంగా గమనార్హం.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Super Women: తొడ‌ల మ‌ధ్య‌లో మూడు పుచ్చకాయ‌ల‌ను తుక్కు తుక్కు చేసింది.. వ‌రల్డ్ రికార్డ్ నెల‌కొల్పింది

Kerala Police: కోవిడ్ నిబంధనలు పాప్యులర్ ట్యూన్ పాటలో..పోలీసుల డ్యాన్స్ తో.. కేరళ పోలీసుల వీడియో వైరల్!