జూలై 19లోగా అయోధ్యపై వాస్తవ నివేదిక ఇవ్వండి: సుప్రీం

| Edited By:

Jul 11, 2019 | 11:34 AM

అయోధ్య స్థల వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్‌పై ఈ నెల 25 నుంచి రోజు వారి విచారణ చేపడతామని స్పష్టం చేసిన ధర్మాసనం.. ఈ నెల 19లోగా మధ్యవర్తిత్వ కమిటీ వాస్తవ నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. కాగా అయోధ్య భూ వివాదంలో పరిష్కారం లభించేలా సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి మొసమ్మద్ ఇబ్రహీం కలిఫుల్లా అధ్యక్షతన త్రిసభ్య కమిటీని గత ఏడాది మార్చి 8న ఏర్పాటు చేశారు. ప్యానల్‌లో శ్రీ శ్రీ రవిశంకర్, మద్రాసు […]

జూలై 19లోగా అయోధ్యపై వాస్తవ నివేదిక ఇవ్వండి: సుప్రీం
Follow us on

అయోధ్య స్థల వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్‌పై ఈ నెల 25 నుంచి రోజు వారి విచారణ చేపడతామని స్పష్టం చేసిన ధర్మాసనం.. ఈ నెల 19లోగా మధ్యవర్తిత్వ కమిటీ వాస్తవ నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

కాగా అయోధ్య భూ వివాదంలో పరిష్కారం లభించేలా సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి మొసమ్మద్ ఇబ్రహీం కలిఫుల్లా అధ్యక్షతన త్రిసభ్య కమిటీని గత ఏడాది మార్చి 8న ఏర్పాటు చేశారు. ప్యానల్‌లో శ్రీ శ్రీ రవిశంకర్, మద్రాసు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ శ్రీరాం పంచూ ఉన్నారు. అయితే ఈ కేసులో మధ్యవర్తిత్వంతో సమస్యకు పరిష్కారం కనిపించడం లేదని పిటిషనర్ గోపాల్ సింగ్ విశారద్ తరపున న్యాయవాది పరాశరణ కోర్టుకు విన్నవించారు. దీనిపై మరో సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్.. మధ్యవర్తిత్వ కమిటీ నచ్చని కొంతమంది ఇలా ఆరోపణలు చేస్తుంటారని అన్నారు. వాదోపవాదనలు విన్న సుప్రీం ప్రధాన న్యాయమూర్తి తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది.