ఎవరు జీవించాలో.. ఎవరు మరణించాలో నిర్ణయించడానికి మనం ఎవరం..? మెర్సీ కిల్లింగ్‌పై సుప్రీంకోర్టు ఏమన్నదంటే..

కారుణ్య మరణానికి అనుమతించాలన్న పిటిషన్‌పై సర్వోన్నత ధర్మాసనం సుప్రీంకోర్టు చలించింది. ఎవరు జీవించాలో.. ఎవరు మరణించాలో నిర్ణయించడానికి మనం ఎవరం?.. మెర్సీ కిల్లింగ్‌కు అనుమతించాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు అలా ఆవేదన వ్యక్తం చేసింది.. ఈ సందర్భంగా ఢిల్లీకి చెందిన 32 ఏళ్ల హరీష్‌ రాణా కేసులో తీర్పును రిజర్వ్‌ చేసింది.

ఎవరు జీవించాలో.. ఎవరు మరణించాలో నిర్ణయించడానికి మనం ఎవరం..? మెర్సీ కిల్లింగ్‌పై సుప్రీంకోర్టు ఏమన్నదంటే..
Supreme Court

Updated on: Jan 16, 2026 | 9:22 AM

కారుణ్య మరణానికి అనుమతించాలన్న పిటిషన్‌పై సర్వోన్నత ధర్మాసనం సుప్రీంకోర్టు చలించింది. ఎవరు జీవించాలో.. ఎవరు మరణించాలో నిర్ణయించడానికి మనం ఎవరం?.. మెర్సీ కిల్లింగ్‌కు అనుమతించాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు అలా ఆవేదన వ్యక్తం చేసింది.. ఈ సందర్భంగా ఢిల్లీకి చెందిన 32 ఏళ్ల హరీష్‌ రాణా కేసులో తీర్పును రిజర్వ్‌ చేసింది.  వివరాల ప్రకారం.. పంజాబ్ విశ్వవిద్యాలయ మాజీ విద్యార్థి హరీష్ రాణా ( ప్రస్తుతం 32 ఏళ్లు) 2013లో తన పేయింగ్ గెస్ట్ వసతి గృహంలోని నాల్గవ అంతస్తు నుండి పడిపోవడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. అప్పటినుంచి మంచంలోనే ఉన్నాడు.. ఢిల్లీకి చెందిన హరీష్‌ రాణా తల్లిదండ్రులు.. ఎన్ని ఆస్ప్రుతులు తిరిగినా అతను కోలుకోలేదు. 13 ఏళ్లుగా కోమాలోనే ఉన్నాడు. ఓవైపు చెట్టంత కొడుకును కాపాడుకోవాలేనే ఉద్దేశంతో వైద్యం కోసం ఎంతో ప్రయత్నించారు. కానీ ఎక్కడా ఫలితం కన్పించలేదు. ఆర్ధికంగా ..మానసికంగా కృంగిపోయారు.

తమ బిడ్డ కారుణ్య మరణానికి అనుమతివ్వాలని.. హరీష్‌ పేరెంట్స్‌ మొదట ఢిల్లీ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.. అయితే.. హరీష్‌ పేరెంట్స్‌ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. హరీష్‌ కోలుకునే అవకాశం లేదని డాక్టర్లు నిర్దారించడంతో ఆ నివేదికతో సుప్రీంను ఆశ్రయించారు హరీష్‌ తల్లిదండ్రులు. వారి పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది.

హరీష్‌ పేరెంట్స్‌ తో న్యాయమూర్తులు స్వయంగా మాట్లాడారు. మెడికల్‌ రిపోర్టలను పరిశీలించారు. ఈ కేసులో ధర్మాసనం ఆవేదనతో చలించింది. కారుణ్యం మరణం అనే పదాన్ని ఉపయోగించలేం.. ఇది చాలా సున్నితమైన అంశం.. ఎవరు బతకాలో.. ఎవరు చనిపోవాలో నిర్ణయించేందుకు మనం ఎవరని వ్యాఖ్యానించారు న్యాయమూర్తులు. వెంటిలేటర్‌పై వైద్యాన్ని ఉపసంహరించే అంశాన్ని పరిశీలిస్తామంటూ సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది.

అలా జరిగితే.. మొదటి కేసు ఇదే..

అయితే.. ఈ కేసుకు అనుమతి లభిస్తే, భారతదేశంలో న్యాయస్థానం ద్వారా ఆమోదించబడిన మొదటి ప్యాసివ్ యూథనేసియా ఉదాహరణగా నిలిచే అవకాశం ఉంది. ఇది 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రక ‘కామన్ కాజ్’ తీర్పులో నిర్దేశించిన సూత్రాలను అమలు చేసే కీలక ఘట్టంగా మారుతుంది. ఆ తీర్పులో సుప్రీంకోర్టు గౌరవంతో మరణించే హక్కును గుర్తిస్తూ, క్రమబద్ధమైన న్యాయ, వైద్య వ్యవస్థ పరిధిలో జీవనాధార చికిత్సలు, మద్దతును ఉపసంహరించుకునే అనుమతిని కల్పించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..