Rajiv Gandhi Murder Case: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హంతకుల్లో ఒకరికి బెయిల్.. 30 ఏళ్ల తర్వాత..

SC grants bail to AG Perarivalan: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో కీలక దోషుల్లో ఒకరైన ఏజీ పెరరివాలన్‌కు సుప్రీంకోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. పెరారివాలన్‌కు యావజ్జీవ కారాగార శిక్ష

Rajiv Gandhi Murder Case: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హంతకుల్లో ఒకరికి బెయిల్.. 30 ఏళ్ల తర్వాత..
Ag Perarivalan

Updated on: Mar 09, 2022 | 3:44 PM

SC grants bail to AG Perarivalan: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో కీలక దోషుల్లో ఒకరైన ఏజీ పెరరివాలన్‌కు సుప్రీంకోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. పెరరివాలన్‌కు యావజ్జీవ కారాగార శిక్ష పడి 32 ఏళ్లుగా జైలులో ఉన్నారు. జైలు నుంచి విడుదల చేయాలంటూ తాను వేసిన పిటిషన్‌పై గవర్నర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. బెయిల్‌ను కేంద్రం వ్యతిరేకిస్తోందని పేర్కొంది. పిటిషనర్ ప్రవర్తన, అతని అనారోగ్యంతోపాటు అతను 30 ఏళ్లకు పైగా జైలులో గడిపిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటే, అతన్ని బెయిల్‌పై విడుదల చేయాలని అభిప్రాయపడుతున్నామని సుప్రీంకోర్టు పేర్కొంది. 1991, మే 21న రాజీవ్‌ హత్య జరిగింది. ఆ తర్వాత ఈ కేసులో ఇప్పుడే తొలి బెయిల్‌ లభించింది. రాజీవ్ గాంధీ హత్య కేసులో పెరరివాలన్ ఇప్పటికే పెరోల్‌పై బయట ఉన్నాడు. ఈ క్రమంలో ఆయన బెయిల్ మంజూరు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. పెరోల్‌పై ఉన్నప్పటికీ బయటకు వెళ్లలేని కారణంగా పెరరివాలన్ బెయిల్ కోరాడు.

రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషిగా ఉన్న ఏజీ పెరరివాలన్ యావజ్జీవ కారాగార శిక్షను తగ్గించాలంటూ చేసిన అభ్యర్థన పిటిషన్ భారత రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉండగా సుప్రీంకోర్టు బుధవారం ఆయనకు బెయిల్ మంజూరు చేయడం ప్రధాన్యం సంతరించుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం.. పెరరివాలన్ కు షరతులతో బెయిల్ మంజూరు అయింది. దీనిప్రకారం ఆయన ప్రతి నెలా స్థానిక పోలీసు అధికారి ముందు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

చెన్నైకి 100 కి.మీ దూరంలో ఉన్న తన స్వగ్రామమైన జోలార్‌పేటను పోలీసులకు ఫిర్యాదు చేయకుండా వదిలి వెళ్లడానికి కూడా అతనికి అనుమతి లేదు. అయితే.. రాజీవ్ గాంధీ హత్య కేసులో పెరరివాలన్ జీవిత ఖైదును అనుభవిస్తున్నాడు. ఇప్పటి వరకు 30 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాడు.

Also Read:

Healthy Foods: రోగనిరోధక శక్తిని పెరగాలంటే..? ఈ ఆహార పదార్థాలను తప్పనసరిగా డైట్‌లో చేర్చుకోండి

TS High Court: బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు.. అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు