Vijay Mallya – Supreme Court: నీకిదే లాస్ట్ ఛాన్స్.. విజయ్ మాల్యాకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన సుప్రీంకోర్టు.. ఎందుకోసమంటే..!

|

Feb 11, 2022 | 3:55 PM

Vijay Mallya - Supreme Court: ఇదే లాస్ట్‌ ఛాన్స్‌. ఈసారి రాకపోతే ఇక తామేంటో చూపిస్తాం అంటూ, మాల్యాకు సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చింది అపెక్స్‌ కోర్ట్‌. మరి సుప్రీంకోర్టు ఇంత సీరియస్‌..

Vijay Mallya - Supreme Court: నీకిదే లాస్ట్ ఛాన్స్.. విజయ్ మాల్యాకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన సుప్రీంకోర్టు.. ఎందుకోసమంటే..!
Supreme Court
Follow us on

Vijay Mallya – Supreme Court: ఇదే లాస్ట్‌ ఛాన్స్‌. ఈసారి రాకపోతే ఇక తామేంటో చూపిస్తాం అంటూ, మాల్యాకు సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చింది అపెక్స్‌ కోర్ట్‌. మరి సుప్రీంకోర్టు ఇంత సీరియస్‌ అవ్వడానికి కారణం ఏంటీ? అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొని విదేశాలకు పరారయ్యారు కింగ్ ఫిషర్స్ మాజీ అధినేత విజయ్‌ మాల్యా. తాజాగా ఆయనపై భారత సర్వోన్నత న్యాయస్థానం సీరియస్ అయ్యింది. మాల్యాకు లాస్ట్‌ ఛాన్స్‌ ఇచ్చింది. కోర్టు ధిక్కరణ కేసులో హాజరు అయ్యేందుకు రెండు వారాల గడువు ఇచ్చింది సుప్రీంకోర్టు. ఇదే చివరి అవకాశం అని స్పష్టం చేసింది. అనంతరం ఈ కేసు విచారణను ఈనెల 24కు వాయిదా వేసింది. 24వ తేదీ లోగా వ్యక్తిగతంగా లేదా ఆయన తరపున న్యాయవాది కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది అపెక్స్‌ కోర్టు. హాజరు కాకపోతే ఈ కేసు ముగింపునకు సంబంధించి తామే తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది సుప్రీం కోర్టు.

వివరాల్లోకెళితే.. 2017లో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘిస్తూ, కుమారుడు, కుమార్తెలకు 40 మిలియన్‌ డాలర్లను బదిలీ చేశారు మాల్యా. దీంతో ఎస్‌బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం సుప్రీంలో పిటిషన్‌ దాఖలు చేసింది. ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం, మాల్యాను కోర్టు ధిక్కరణ కింద దోషిగా తేలుస్తూ 2017 మే నెలలో తీర్పు చెప్పింది. కానీ, అప్పటికే లండన్‌ పారిపోయాడు మాల్యా. తిరిగి భారత్‌కు రాలేదు. అదే సమయంలో విజయ్‌ మాల్యాను దివాలాదారుగా ప్రకటించింది లండన్‌ కోర్టు. మాల్యాకు సంబంధించిన ఆస్తులను జప్తు చేసుకునేందుకు బ్యాంకుల కన్సార్షియంకు గతంలోనే అనుమతి ఇచ్చింది. దీంతో నిలువ నీడ లేని పరిస్థితికి చేరుకున్నారాయన. ఇన్ని సంవత్సరాలు ఆయన తలదాచుకుంటూ వస్తోన్న లండన్‌లోని విలాసవంతమైన బంగళా కూడా చేజారిపోయింది. అటు వేల కోట్ల రుణాలు ఎగవేసిన కేసుల్లో నిందితుడిగా ఉన్న మాల్యాను భారత్‌కు అప్పగించేందుకు అంగీకారం తెలిపింది బ్రిటన్‌ ప్రభుత్వం. కానీ పలు కారణాలు చెబుతూ అక్కడే తలదాచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు విజయ్‌ మాల్యా.

Also read:

BARC Recruitment 2022: BARCలో గ్రూప్ A పోస్టులకు చివరి తేదీ పొడిగింపు..ఇంజినీరింగ్‌ చేసినవారికి అవకాశం!

CM KCR Public Meeting: సీఎం కేసీర్ భారీ బహిరంగ సభ.. కేద్రం పై ఎటాక్ ?? లైవ్ వీడియో

Tollywood: ఏపీ సినిమా టికెట్ల ధరలపై రానున్న క్లారిటీ.. ఈనెల 17న కమిటీ కీలక భేటీ..