PMLA Act: మనీలాండరింగ్‌ చట్టంపై తీర్పును పునఃసమీక్షించాలని సుప్రీంకోర్టులో పిటిషన్‌.. నేడు విచారణ..

|

Aug 23, 2022 | 9:23 AM

PMLA Act: మనీలాండరింగ్‌ చట్టంపై తీర్పును పునఃసమీక్షించాలని సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలయ్యింది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది..

PMLA Act: మనీలాండరింగ్‌ చట్టంపై తీర్పును పునఃసమీక్షించాలని సుప్రీంకోర్టులో పిటిషన్‌.. నేడు విచారణ..
Supreme Court
Follow us on

PMLA Act: మనీలాండరింగ్‌ చట్టంపై తీర్పును పునఃసమీక్షించాలని సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలయ్యింది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది సుప్రీంకోర్టు. PMLA చట్టం సరైనైదే అని గతనెలలోనే సుప్రీం తీర్పు చెప్పింది. అయితే తీర్పును న విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. PMLA చట్టం 2002 కు 2019లో సవరణలు చేసి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ లాంటి వంటి దర్యాప్తు సంస్థలకు మరిన్ని అధికారాలు కల్పించడాన్ని ఇటీవల సుప్రీం కోర్టు సమర్థించింది. ఈడీ అరెస్టులు, సోదాలు సరైనవేనని , దర్యాప్తు అధికారులు పోలీసులు కాదని స్పష్టం చేసింది. అయితే సుప్రీం తీర్పును అత్యంత ప్రమాదకరమైన తీర్పుగా దాదాపు 17 విపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. దీర్ఘకాలం పాటు దీని ప్రభావం ఉంటుందని, తీర్పును పునస్పమీక్షించాలని కోరాయి.

దీనిపై కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే , ఆమ్ ఆద్మీ పార్టీ, సిపిఎం, సమాజ్‌వాది పార్టీ, ఆర్‌జేడీ వంటి ప్రధాన పార్టీలు సంతకాలు చేశాయి. ఈ చట్టంలో చాలా తక్కువ మంది దోషులుగా తేలారని తెలిపాయి. గత ఎనిమిదేళ్ల పాలనలో ఈడీ దాడులు 26 రెట్లు పెరిగాయని విపక్షాలు ఆరోపించాయి. 3010 మనీ లాండరింగ్ కేసులు నమోదు కాగా, అందులో 23 మంది మాత్రమే దోషులుగా తేలారు. 112 సోదాల్లో ఎలాంటి ఆధారాలు లేవు. పార్లమెంట్‌లో మనీలాండరింగ్ చట్ట సవరణ చేసిన విధానాన్ని విపక్షాలు తప్పుపట్టాయి. మనీ బిల్‌గా ప్రవేశ పెట్టిన ఫైనాన్స్ చట్టం కింద వాటిని ఆమోదించారని పేర్కొన్నాయి. మనీ బిల్లు తప్పనిసరిగా కన్సాలిడేటెడ్ ఫండ్, ట్యాక్స్‌ల నుంచి నగదు కేటాయింపులకు వర్తించాలని, కానీ, ఇతర అంశాల్లో చట్టాలు చేసేందుకు ఉపయోగించకూడదని పేర్కొన్నాయి. కపిల్‌సిబాల్‌ , ప్రశాంత్‌ భూషణ్‌ లాంటి ప్రముఖ న్యాయవాదులు కూడా ఈడీకి అదనపు అధికారాలు కట్టబెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బీజేపీ మాత్రం ఈ చట్టాన్ని సమర్ధిస్తోంది. యుపీఏ హయాం లోనే ఈ చట్టాన్ని తీసుకొచ్చారని , ఇప్పుడు ఎందుకు కాంగ్రెస్‌ వ్యతిరేకిస్తోందని బీజేపీ ప్రశ్నించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..