Chief Justice N V Ramana: సాధారణంగా విదేశాల్లో ఉన్నత చదువులు పూర్తి చేసి వచ్చినవారికి, పెద్ద పెద్ద ఉద్యోగాలు, ఘనతలు సాధించిన వారికి స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటుచేస్తారు. అయితే ఓ అత్యాచారం కేసులో జైలుపాలై, బెయిల్ పై బయటికొచ్చిన ఓ నిందితుడికి ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు అతడి మద్దతుదారులు. ‘అన్న తిరిగి వచ్చాడు’ అంటూ సంబరాలు కూడా చేసుకున్నారు. మధ్యప్రదేశ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అన్న తిరిగొచ్చాడని ఓ హోర్డింగ్ ఏర్పాటు చేశారు.. రేప్ కేసులో నిందితుడు బెయిల్‌పై వస్తే సంబరాలు చేసుకోవడమా? అన్న తిరిగి రావడం ఏంటి? .. ఈ ఒక్క వారం మీ అన్నను జాగ్రత్తగా ఉండమని చెప్పండి’ అని నిందితుడి తరపున వాదిస్తున్న న్యాయవాదికి చురకలంటించింది ధర్మాసనం. వివరాల్లోకి వెళితే..
జాగ్రత్తగా ఉండమనండి..
మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ విద్యార్థి సంఘం నేత.. అత్యాచారం కేసులో అరెస్టయి బెయిల్‌పై విడుదలైతే ‘భయ్యా ఈజ్ బ్యాక్’ (అన్న తిరిగొచ్చాడు) అని పోస్టర్లు వేసి ఘన స్వాగతం పలికారు అతడి మద్దతి దారులు. దీంతో నిందితుడికి హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ బాధితురాలు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వెంటనే బెయిల్‌ను రద్దు చేయాలని కోరింది. పెళ్లి పేరుతో నిందితుడు వంచించాడని, పలుసార్లు అత్యాచారం చేసి, గర్భవతి చేశాడని యువతి ఆరోపించింది. అంతేకాదు, బలవంతంగా అబార్షన్ చేయించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడని పిటిషన్‌లో పేర్కొంది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగానే ‘ అత్యాచారం కేసులో నిందితుడు బెయిల్‌పై వస్తే సంబరాలు చేసుకోవడమా? ఈ ఒక్క వారం మీ అన్నను జాగ్రత్తగా ఉండమని చెప్పండి’ నిందితుడి తరఫున న్యాయవాదికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఘాటుగాచెప్పారు. నిందితుడి బెయిల్‌ను ఎందుకు రద్దుచేయకూడదు? అంటూ పేర్కొంటూ నోటీసులు జారీచేసింది.అంతేకాదు ఈ అంశంపై స్పందించాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరింది. ఇక కేసు విషయానికి వస్తే..నిందితుడు శుభాంగ్ గోంటియా ఏబీవీపీ విద్యార్థి నాయకుడు. కాగా ఓ ప్రైవేట్ వేడుల్లో నిందితుడు తన మెడలో తాళి కట్టాడని అయితే బహిరంగంగా తనను భార్యగా అంగీకరించడం లేదని బాధితురాలు సుప్రీంను ఆశ్రయించింది. అతడి వల్ల తాను గర్భం దాల్చితే బలవంతంగా అబార్షన్ చేయించాడని వాపోయింది. దీంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు గోంటియా. దీంతో జూన్ 2021లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి, నిందితుడి ఆచూకీ చెప్పినవారికి రూ.5 వేల నగదు రివార్డును పోలీసులు ప్రకటించారు. కొద్ది రోజుల తర్వాత నిందితుడ్ని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అయితే శుభాంగ్ కు మధ్యప్రదేశ్ హైకోర్టు గత నవంబరులో బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఈ కేసులో వాస్తవాలు, తీవ్రతను హైకోర్టు పరిగణనలోకి తీసుకోకుండా నిందితుడికి బెయిల్ మంజూరు చేశారని బాధిత మహిళ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ఈ తీర్పు హర్షణీయం..
కాగా ఈ విషయంపై సుప్రీం చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ చేసిన వ్యాఖ్యలపై ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ప్రశంసలు కురిపించారు. ‘ హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు గూండాలు, నేర చరితుల చేతుల్లో ఆయుధాలుగా మారాయి. వాటితో ప్రజలను మభ్యపెడుతున్నారు. ఈవిషయంపై స్పందించి తీర్పు వెలువరించిన సీజేఐ ఎన్వీ రమణకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అంటూ ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చారు శ్రవణ్.
Hoardings and Plastic Flexes have become Political camouflaging tools in the hands of Goons & Crony Capitalists misleading people and their perception.
Humbly thank Hon’ble CJ of India for his keen observations??@PramodChturvedi @ANI @PTI_News #NVRamana #SupremeCourtofIndia pic.twitter.com/TVZho5Bzyq— Prof Dasoju Srravan (@sravandasoju) April 12, 2022
Also Read: Shehbaz Sharif: పాక్ కొత్త ప్రధాని కీలక నిర్ణయాలు.. ప్రధాని మోడీ విషెస్‌కు ధన్యవాదాలు
Shehbaz Sharif: పాక్ కొత్త ప్రధాని కీలక నిర్ణయాలు.. ప్రధాని మోడీ విషెస్‌కు ధన్యవాదాలు
Multibagger stock: స్టాక్ రేట్ తక్కువే కానీ ఇచ్చిన రాబడి ఎక్కువ.. ఇంతకీ ఆ షేర్ ఏమిటంటే..