Bindeshwar Pathak: సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు బిందేశ్వర్ పాఠక్ కన్నుమూత.. జాతీయ జెండా ఎగురవేసిన తర్వాత..

Sulabh International Founder Pathak passed away: సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్ కన్నుమూశారు. న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆయన మంగళవారం తుది శ్వాస విడిచారు. నివేదికల ప్రకారం.. సులభ్ ఇంటర్నేషనల్ సెంట్రల్ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసిన తర్వాత పాఠక్ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. ఆ తర్వాత బిందేశ్వర్ పాఠక్ ను సిబ్బంది హుటాహుటిన ఢిల్లీలోని AIIMSకి తరలించారు.

Bindeshwar Pathak: సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు బిందేశ్వర్ పాఠక్ కన్నుమూత.. జాతీయ జెండా ఎగురవేసిన తర్వాత..
Bindeshwar Pathak

Updated on: Aug 15, 2023 | 5:21 PM

Sulabh International Founder Pathak passed away: సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్ (80) కన్నుమూశారు. న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆయన మంగళవారం తుది శ్వాస విడిచారు. నివేదికల ప్రకారం.. సులభ్ ఇంటర్నేషనల్ సెంట్రల్ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసిన తర్వాత పాఠక్ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. ఆ తర్వాత బిందేశ్వర్ పాఠక్ ను సిబ్బంది హుటాహుటిన ఢిల్లీలోని AIIMSకి తరలించారు. వెంటనే వైద్యులు ఆయనకు చికిత్స అందించారు. అయినప్పటికీ.. ఆయన ఆరోగ్యం కుదుటపడలేదు. మధ్యాహ్నం ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో గుండెపోటుతో పాఠక్ మరణించినట్లు ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉదయం పాఠక్ జాతీయ జెండాను ఎగురవేసి, ఆ వెంటనే కుప్పకూలిపోయాడని సహాయకుడు తెలిపారు. ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. మధ్యాహ్నం 1.42 గంటలకు పాఠక్ మరణించినట్లు ప్రకటించారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మరణానికి కారణం కార్డియాక్ అరెస్ట్ అని తెలిపారు.

ప్రధాని మోడీ సంతాపం..

సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. “డాక్టర్ బిందేశ్వర్ పాఠక్ మరణించడం మన దేశానికి తీరని లోటు. ఆయన సామాజిక పురోగతికి, అణగారిన వర్గాల సాధికారత కోసం విస్తృతంగా కృషి చేసిన దార్శనికుడు. స్వచ్ఛ భారత్ మిషన్‌కు స్మారక మద్దతును అందించారు” అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి

పబ్లిక్ టాయిలెట్లను నిర్మించడంలో సులభ్ అగ్రగామిగా నిలిచింది. బిందేశ్వర్ పాఠక్ సులభ్ ఇంటర్నేషనల్ ను స్థాపించి వేలాది కమ్యూనిటీ పబ్లిక్ టాయిలెట్లను నిర్మించారు. దీనిద్వారా భారతదేశంలో బహిరంగ మలవిసర్జనకు వ్యతిరేకంగా పోరాడినందుకు పాఠక్ ప్రసిద్ధి చెందారు. ఐదు దశాబ్దాలుగా దేశవ్యాప్త పారిశుద్ధ్య ఉద్యమాన్ని నిర్మించడానికి తన జీవితాన్ని అంకితం చేసినందుకు పాఠక్ భారతదేశంతోపాటు.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. మరుగుదొడ్లు కొనుగోలు చేయలేని లక్షలాది మంది, మాన్యువల్ స్కావెంజర్లుగా పనిచేసిన వారి జీవితాల్లో అతని సహకారం గణనీయమైన మార్పును తెచ్చిపెట్టింది. తక్కువ కులాల కారణంగా సమాజంలో తీవ్రమైన వివక్షను ఎదుర్కొన్న చాలామందికి ఆయన ఉపాధిని కల్పించారు.

డాక్టర్ బిందేశ్వర్ పాఠక్ బీహార్‌లోని వైశాలి జిల్లా రాంపూర్ బాఘేల్ గ్రామంలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. పాఠశాల విద్యను గ్రామంలోనే పూర్తిచేశారు. తర్వాత పాట్నాకు వెళ్లి బీఎన్ కాలేజీలో చేరి అక్కడ సామాజిక శాస్త్రంలో పట్టభద్రుడయ్యారు. చదువు పూర్తయిన వెంటనే, పాట్నాలోని గాంధీ శతాబ్ది కమిటీలో వాలంటీర్‌గా చేరడానికి ముందు కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేశారు. అయితే, ఇది అతని అసలు ప్రణాళిక కాదు.

పాఠక్ మధ్యప్రదేశ్‌లోని సాగర్ యూనివర్సిటీలో క్రిమినాలజీలో మాస్టర్స్ చేయాలనుకున్నారు. సాగర్‌కు ప్రయాణిస్తున్నప్పుడు, గాంధీ శతాబ్ది కమిటీలో చేరమని ఇద్దరు పెద్దమనుషులు ఆయనకు సలహా ఇచ్చారు. అతనికి మంచి జీతం వస్తుందని వారు చెప్పారు. డబ్బు అవసరం కాబట్టి, పాఠక్ ఒప్పుకున్నారు. అయితే కమిటీని ఆశ్రయిస్తే ఉద్యోగం లేదని తెలిసింది. అతను సాగర్‌లో అడ్మిషన్‌కు గడువు కోల్పోయినందున, వాలంటీర్‌గా పని చేయాలని నిర్ణయించుకున్నారు. పాఠక్ డాక్టరేట్‌తో సహా తన అధునాతన డిగ్రీలను పూర్తి చేసే సమయానికి, అతనికి వివాహం జరిగి పిల్లలు కూడా ఉన్నారు. ఆ తర్వాత ఆయన స్థాపించిన సులభ్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..