రక్తసిక్తమైన ‘సుక్మా’.. మిస్సైన 17మంది జవాన్ల మృతదేహాలు లభ్యం

| Edited By:

Mar 22, 2020 | 4:02 PM

ఛత్తీస్‌గఢ్ అడవుల్లో మావోయిస్టులు మారణ హోమానికి పాల్పడ్డారు. శనివారం మధ్యాహ్నం సుక్మా అడవుల్లో భద్రతా బలగాలకు, జవాన్లకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్లో 17మంది జవాన్లు మృతి చెందగా.. 14మందికి గాయాలయ్యాయి.

రక్తసిక్తమైన సుక్మా.. మిస్సైన 17మంది జవాన్ల మృతదేహాలు లభ్యం
Follow us on

ఛత్తీస్‌గఢ్ అడవుల్లో మావోయిస్టులు మారణ హోమానికి పాల్పడ్డారు. శనివారం మధ్యాహ్నం సుక్మా అడవుల్లో భద్రతా బలగాలకు, జవాన్లకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్లో 17మంది జవాన్లు మృతి చెందగా.. 14మందికి గాయాలయ్యాయి. అయితే ఎన్‌కౌంటర్ తరువాత చనిపోయిన జవాన్ల మృతదేహాలు అదృశ్యమయ్యాయి. దీంతో దాదాపు 24 గంటలుగా డ్రోన్ల సాయంతో వారి మృతదేహాలను వెతికారు. మృతుల్లో ముగ్గురు స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF), 14 మంది డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ (GRG) సిబ్బంది ఉన్నట్లు తెలిపారు. పోలీసుల నుంచి 10 ఏకే 47 సహా.. ఐదు ఆటోమెటిక్ రైఫిల్స్ ని మావోలు తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు.

కాగా ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దులో మావోయిస్టుల సమావేశం జరుగుతోందని ఇంటెలిజన్స్ ద్వారా భద్రతా దళాలకు సమాాచారం అందింది. ఈ సమావేశానికి మావోయిస్టు అగ్రనేతలు కూడా హాజరవుతారని వారికి సమాచారం వచ్చింది. ఈ క్రమంలో సుమారు 600 మందితో కూడిన DRG, STF, CRPFకి చెందిన COBRA దళాలు అడవిలోకి వెళ్లాయి. ఈ క్రమంలో మన్నప్ప అటవీ ప్రాంతం సమీపంలో కొందరు మావోయిస్టులు తారసపడడంతో.. ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 17మంది జవాన్లు అసువులు బాశారు. బుర్కపాల్‌లో జరిగిన ఎన్‌కౌంటర్ తరువాత ఇదే అతి పెద్ద ఎన్‌కౌంటర్ అని డీజీపీ వెల్లడించారు.