Farmers: ఇంకొన్ని రోజులుపోతే రైతే ఉండడేమో.. ఆ మూడు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన అన్నదాతల ఆత్మహత్యలు..

|

Dec 10, 2022 | 8:22 AM

Farmers Suicide: దేశానికి అన్నం పెట్టే అన్నదాత ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ఆరుగాలం పండించిన పంటకు గిట్టు బాటులేక చేసిన అప్పులు తీర్చలేక దుక్కిదున్నిన చోటే తనువు చాలిస్తున్నారు. రైతే రాజు అని అంటారు..

Farmers: ఇంకొన్ని రోజులుపోతే రైతే ఉండడేమో.. ఆ మూడు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన అన్నదాతల ఆత్మహత్యలు..
Farmers Suicide
Follow us on

దేశానికి అన్నం పెట్టే అన్నదాత ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ఆరుగాలం పండించిన పంటకు గిట్టు బాటులేక చేసిన అప్పులు తీర్చలేక దుక్కిదున్నిన చోటే తనువు చాలిస్తున్నారు. రైతే రాజు అని అంటారు.. కాని ఇప్పుడు ఆ రైతే కనిపించని పరిస్థితి దేశంలో నెలకొంది. ఎండనకా వాననకా భూమిని అన్నపూర్ణగా తీర్చిదిద్ది చివరకు బలవంతంగా ఆ మట్టిలోనే కలిసిపోతున్నారు. ఈ విషయం సాక్షాత్తు కేంద్రప్రభుత్వమే చెబుతోంది.

రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో రైతుల ఆత్మహత్యలపై కేంద్రం సంచలన ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా రైతుల ఆత్మహత్యలు పెరిగాయని.. 2019 నుంచి 2021 కాలంలో ఈ సంఖ్య మరింత అయిందని పేర్కొంది. కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీలోనే ఎక్కువగా రైతులు బలవన్మరణాలకు పాల్పడినట్లు స్పష్టం చేసింది. ఒక్క ఏపీలోనే 1673 మంది ఆత్మహత్య చేసుకున్నారని తెలిపింది. రాజ్యసభ సాక్షిగా రైతు ఆత్మహత్యలపై లెక్కలతో సహా వివరించింది.

ఏపీలో 2019లో 628 మంది, 2020లో 564, 2021లో 481 ఆత్మహత్య చేసుకున్నారని కేంద్రం వెల్లడించింది. ఇంకొన్ని రాష్ట్రాల్లోనూ రైతుల ఆత్మహత్యలు తగ్గాయని ప్రకటించింది. ఏపీలో రైతు ఆత్మహత్యలు చంద్రబాబు హయాంలోనే ఎక్కువగా ఉన్నాయని వైసీపీ విమర్శించింది. కేంద్ర లెక్కల ప్రకారం వైఎస్‌ జగన్‌ అధికారం చేపట్టిన తర్వాత రైతు బలవన్మరణాలు తగ్గిపోయాయంటోంది వైసీపీ.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..