Shocking : గాంధీ హత్యకేసు రీ ఓపెన్..?..ఆ రివాల్వర్ ఎక్కడ..?

| Edited By:

Feb 17, 2020 | 4:31 AM

సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అయిన బీజేపీ ఎంపీ సుబ్రమణియన్ స్వామి గురించి తెలిసిందే. ఆయన తెరమీదకు తీసుకొచ్చే కేసులు అలాంటి ఇలాంటి కేసులు కాదు.. అన్నీ సంచలనాలే. తాజాగా మహాత్మాగాంధీ హత్య కేసును రీ – ఓపెన్ చేయాలంటూ.. ఆయన డిమాండ్ చేశారు. ట్విట్టర్ వేదికగా.. గాంధీ హత్య కేసు విషయంలో పలు ప్రశ్నలను లేవనెత్తుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీ హత్య కేసును రీఓపెన్ చేసి పునర్విచారణ జరిపించాలన్నారు. గాంధీ మృతదేహానికి ఎందుకు పోస్టుమార్టమ్ నిర్వహించలేదని.. […]

Shocking : గాంధీ హత్యకేసు రీ ఓపెన్..?..ఆ రివాల్వర్ ఎక్కడ..?
Follow us on

సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అయిన బీజేపీ ఎంపీ సుబ్రమణియన్ స్వామి గురించి తెలిసిందే. ఆయన తెరమీదకు తీసుకొచ్చే కేసులు అలాంటి ఇలాంటి కేసులు కాదు.. అన్నీ సంచలనాలే. తాజాగా మహాత్మాగాంధీ హత్య కేసును రీ – ఓపెన్ చేయాలంటూ.. ఆయన డిమాండ్ చేశారు. ట్విట్టర్ వేదికగా.. గాంధీ హత్య కేసు విషయంలో పలు ప్రశ్నలను లేవనెత్తుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీ హత్య కేసును రీఓపెన్ చేసి పునర్విచారణ జరిపించాలన్నారు. గాంధీ మృతదేహానికి ఎందుకు పోస్టుమార్టమ్ నిర్వహించలేదని.. ప్రత్యక్ష సాక్షులైన అభా, మనులను కోర్టులో ఎందుకు విచారించలేదంటూ ప్రశ్నించారు. గాడ్సే కాల్చిన రివాల్వర్‌‌ను ఇప్పటివరకు ఎందుకు పట్టుకోలేకపోయారని ప్రశ్నించారు. అందు కోసమే ఇప్పుడు ఈ కేసును రీఓపెన్ చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఇక మరో ట్వీట్‌లో అసోసియేటెడ్ ప్రెస్ ఇంటర్నేషనల్ జర్నోను ప్రస్తావిస్తూ పోస్ట్ చేశారు. ఈ ట్వీట్‌లో కూడా పలు ప్రశ్నలను సంధించారు. హత్య జరిగిన రోజు సాయంత్రం 5.05 గంటలకు అతను 4 బుల్లెట్ శబ్దాలు విన్నాడని చెప్పారు. అయితే మరి గాడ్సే మాత్రం తాను రెండుసార్లు మాత్రమే తుపాకీ కాల్చానని చెప్పాడన్నారు. ఏపీఐ జర్నలిస్టు.. బిర్లా హౌజ్ వద్ద గాంధీ 5.40గంటలకు చనిపోయాడని చెప్పాడని.. అంటే, 35నిమిషాల పాటు ఆయన బతికే ఉన్నారని అన్నారు. కాగా స్వామి చేసిన ఈ ట్వీట్‌పై నెటిజెన్స్ నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ముందు ముందు.. ఈ అంశం ఎక్కడి వరకు దారితీస్తుందో వేచిచూడాల్సిందే.