సాహస ఎస్సై కోలుకున్నారు.. సీఎంవో ప్రకటన..!

కరోనాపై పోరులో ముందుండి పోరాడిన సబ్‌ ఇన్‌స్పెక్టర్ హర్జీత్ సింగ్ పూర్తిగా కోలుకున్నట్లు పంజాబ్ సీఎంవో ప్రకటించింది.

సాహస ఎస్సై కోలుకున్నారు.. సీఎంవో ప్రకటన..!

Edited By:

Updated on: Apr 27, 2020 | 6:34 PM

కరోనాపై పోరులో ముందుండి పోరాడిన సబ్‌ ఇన్‌స్పెక్టర్ హర్జీత్ సింగ్ పూర్తిగా కోలుకున్నట్లు పంజాబ్ సీఎంవో ప్రకటించింది. ఈ సందర్భంగా ఆయనకు చికిత్స అందించిన పీజీఐ స్టాఫ్‌కు ధన్యావాదాలని.. హర్జీత్ సింగ్ చేయి మునుపటిలాగే పనిచేస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నట్లు సీఎంవో ట్వీట్‌లో పేర్కొన్నారు.

కాగా లాక్‌డౌన్‌ నేపథ్యంలో పటియాలా జిల్లా సనౌర్ పట్టణంలో విధులు నిర్వహిస్తోన్న హర్జీత్ సింగ్‌ చేతిని ఏప్రిల్ 12న నిహంగ్‌(సిక్కుల్లోని ఓ వర్గం) కత్తితో నరికారు. వెంటనే ఆయనను పీజీఐఎంఈఆర్‌కు(పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్) తరలించారు. అక్కడి వైద్య బృందం ఏడున్నర గంటల పాటు సర్జరీ చేసి విజయవంతంగా ఆయన చేతిని అతికించారు. ఇక ఆ వీడియోలో కాసేపు మాట్లాడిన హర్జీత్.. చివర్లో ‘జై హింద్’ అని సెల్యూట్ చేశారు. ఇదిలా ఉంటే మరోవైపు హర్జీత్ సింగ్‌కు సంఘీభావంగా పంజాబ్ రాష్ట్ర పోలీసులు సోమవారం ప్రత్యేక ప్రదర్శనను చేపట్టారు. తమ ఖాకీ యూనిఫామ్‌లపై హర్జీత్‌ సింగ్ బ్యాడ్జిలను వారు ధరించారు. ఈ కార్యక్రమానికి ‘మే భీ హర్జీత్ సింగ్’ అనే పేరును పెట్టారు.

Read This Story Also: బాలీవుడ్ సింగర్ కనికాకు మరో షాక్..!