CBSE Exams: సీబీఎస్‌ఈ పరీక్షలకు సిద్ధమవుతున్నారా..? మంచి మార్కులు సాధించాలంటే ఇవి గుర్తించుకోవాల్సిందే..!

|

Feb 22, 2021 | 3:56 PM

CBSE Exams: కోవిడ్‌-19 విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపింది. గత ఏడాదికి పైగా విద్యాసంస్థలన్నీ మూతపడి ప్రస్తుతం మెల్లమెల్లగా తెరుచుకుంటున్నాయి. ఆన్‌లైన్‌ క్లాసుల పేరుతో ...

CBSE Exams: సీబీఎస్‌ఈ పరీక్షలకు సిద్ధమవుతున్నారా..? మంచి మార్కులు సాధించాలంటే ఇవి గుర్తించుకోవాల్సిందే..!
telangna students
Follow us on

CBSE Exams: కోవిడ్‌-19 విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపింది. గత ఏడాదికి పైగా విద్యాసంస్థలన్నీ మూతపడి ప్రస్తుతం మెల్లమెల్లగా తెరుచుకుంటున్నాయి. ఆన్‌లైన్‌ క్లాసుల పేరుతో విద్యార్థులు పెద్దగా చదివిందేమి లేదు. ఈ ఏడాది మొత్తం విద్యార్థుల చదువులు గందరగోళంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయా బోర్డులు పరీక్షల తేదీలను ప్రకటించాయి. సీబీఎస్‌ఈ సైతం పరీక్షల తేదీలను ప్రకటించింది. సిలబస్‌ సరిగా పూర్తి కాకపోవడం, ఆన్‌లైన్‌ క్లాసులు అస్తవ్యస్తంగా సాగడంతో విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇక పరీక్షల కోసం సిద్దమవుతున్న విద్యార్థుల కోసం విద్యావేత్తలు పలు సూచనలు చేస్ఉతన్నారు. ఇవేంటంటే..

సిలబస్‌పై అవగాహన తప్పనిసరి:

కరోనా కారణంగా ఈ సారి సిలబస్‌ తగ్గించింది ప్రభుత్వం. విద్యార్థులు ఈ అంశంపై పూర్తి అవగాహన పెంచుకోవడం ఎంతో అవసరం. తగ్గించిన సిలబస్‌ ఏమిటీ..? ఎంత వరకు చదువుకుంటే సరిపోతుంది వంటి అంశాలు గుర్తించుకోవడం అవసరం. ఇలాంటి విషయాలు బాగా గుర్తించుకుంటే పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించవచ్చు. ఇక కరోనా కాలంలో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం సిలబస్‌ను తగ్గించింది. తగ్గించిన సిలబస్‌పై పూర్తిగా అవగాహన పెంచుకోవడం ఎంతో అవసరం.

పరీక్ష పత్రంపై అవగాహన పెంచుకోవాలి:

విద్యార్థులు పరీక్షా పత్రంపై అవగాహన పెంచుకోవాలి. ఇందు కోసం ప్రాక్టీస్‌ పేపర్లను చూడాలి. అందులో ఎలాంటి ప్రశ్నలు వచ్చాయనే దానిపై దృష్టి పెట్టాలి. ఈ విధంగా పరీక్షల్లో మంచి మార్కులు సాధించుకోవచ్చు.

మంచి ప్లానింగ్‌తో పరీక్షలకు సిద్ధం కావాలి:

పరీక్షలు రాసే విద్యార్థులు మంచి ప్లానింగ్‌ చేసుకుని పరీక్షలు రాసేందుకు సిద్ధం కావాలి. ఎందుకంటే కరోనా ఎఫెక్ట్‌తో విద్యార్థులకు మొత్తం ఆన్‌లైన్‌ క్లాసులే జరుగుతున్నాయి. తరగతి గదుల్లో చదివిన చదువులకు, ఆన్‌లైన్‌ క్లాసులకు చాలా తేడా ఉంటుంది. అందుకు ముందస్తుగా సబ్జెక్టులపై అవగాహన పెంచుకోవాలి.

విశాలమైన వాతావరణం ఉండాలి:

కరోనా ఎఫెక్ట్‌తో అనేక మంది ఉద్యోగులు వర్క్‌ ఫ్రం హోం, విద్యార్థులంతా స్టీడీ ఫ్రం హోం చేస్తున్నారు. దీంతో బెడ్‌పై ఉండి చదువుకోవడం చేస్తున్నారు. అలా బెడ్‌పై పడుకుని స్టడీ చేయడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. ఇంట్లో ఉండి చదువుకున్న విశాలమైన వాతావరణంలో ఉండి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చదువుకుంటే మంచిది. ఫిజికల్‌ క్లాస్‌ రూం మాదిరిగానే సెటప్‌ చేసుకుని మంచిదని సూచిస్తున్నారు.

రివిజన్‌ చేయడం మంచిది:

గత ఏడాది ప్రశ్న పత్రాలలో కనిపించే ముఖ్య అంశాలు, సాధారణ ప్రశ్నలను రివిజన్‌ చేయడం అవసరం మిగతా ప్రశ్నలను కూడా మరో సారి రివిజన్‌ చేయడం మంచిది.

తప్పులను గుర్తించడం ముఖ్యం:

సాధారణంగా విద్యార్థులు ఏదో ఒక తప్పు చేయడం అనేది సహజం. దీంతో ప్రతి విద్యార్థులు తాము సాధారణంగా చేసే తప్పులను గుర్తించుకుని సవరించుకుంటే మంచి ఫలితాలు సాధించవచ్చు. పరీక్షల్లో చిన్న చిన్న తప్పులు చేయకుండా ముందుస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలి.

పరీక్షలు రాసే విద్యార్థులు ముందుగా ప్రశ్నలను అర్థం చేసుకోవడం ఎంతో ముఖ్యం. మాథ్స్‌ లాంటి ప్రశ్న పత్రాల్లో అర్థం కాని ప్రశ్నలు అధికంగా ఉంటాయి. పాత ప్రశ్న పత్రాలను గమనించడం ద్వారా ఇలాంటి సమస్యలను ఎదురుకాకుండా ఉంటుంది. పాత ప్రశ్నలను గుర్తించుకోవడం వల్ల అందుకు సంబంధించిన కొన్ని గందరగోళ ప్రశ్నలు సునాయాసంగా అర్థం చేసుకోవచ్చు.

సమయ పాలన ముఖ్యం:

అలాగే పరీక్షలకు సిద్ధం కావడం ఎంత ముఖ్యమో.. కేటాయించిన సమయంలో జవాబులను పూర్తి చేయడం అంతే ముఖ్యం. పాత ప్రశ్నలతో ప్రాక్టీస్‌ చేయడం ద్వారా విద్యార్థులు ఎలాంటి సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు పాటించవచ్చు.

Also Read: EPFO: మీరు పీఎఫ్‌ ఖాతాదారులా..? ఏప్రిల్‌ 1 నుంచి కొత్త నిబంధనలు.. ఈ వివరాలు తెలుసుకోవాల్సిందే..!