నెల వ్యవధిలో.. ఇద్దరు ఢిల్లీ మాజీ మహిళా సీఎంలు..

నెల రోజులు కూడా గడవలేదు. ఇద్దరు ఢిల్లీ మాజీ మహిళా సీఎంలు కన్నుమూశారు. జులై 20వ తేదీన గుండెపోటుతో షీలాదీక్షిత్‌ తుదిశ్వాస విడువగా, సరిగ్గా నెలరోజులు కూడా గడవలేదు.. మరో మహిళా నేత సుష్మాస్వరాజ్‌ అదే తరహాలో కన్నుమూశారు. షీలా దీక్షిత్‌ ఢిల్లీ ముఖ్యమంత్రిగా జాతీయ స్థాయి గుర్తింపు పొందారు. షీలా దీక్షిత్ కంటే ముందే ఆ పదవిని సుష్మా స్వరాజ్ అధిష్టించారు. అనంతరం జాతీయ నాయకురాలిగా తనదైన ముద్ర వేశారు. ఢిల్లీ అయిదో ముఖ్యమంత్రిగా సుష్మాస్వరాజ్‌ […]

నెల వ్యవధిలో.. ఇద్దరు ఢిల్లీ మాజీ మహిళా సీఎంలు..

Edited By:

Updated on: Aug 07, 2019 | 9:38 AM

నెల రోజులు కూడా గడవలేదు. ఇద్దరు ఢిల్లీ మాజీ మహిళా సీఎంలు కన్నుమూశారు. జులై 20వ తేదీన గుండెపోటుతో షీలాదీక్షిత్‌ తుదిశ్వాస విడువగా, సరిగ్గా నెలరోజులు కూడా గడవలేదు.. మరో మహిళా నేత సుష్మాస్వరాజ్‌ అదే తరహాలో కన్నుమూశారు. షీలా దీక్షిత్‌ ఢిల్లీ ముఖ్యమంత్రిగా జాతీయ స్థాయి గుర్తింపు పొందారు. షీలా దీక్షిత్ కంటే ముందే ఆ పదవిని సుష్మా స్వరాజ్ అధిష్టించారు. అనంతరం జాతీయ నాయకురాలిగా తనదైన ముద్ర వేశారు. ఢిల్లీ అయిదో ముఖ్యమంత్రిగా సుష్మాస్వరాజ్‌ పనిచేయగా, ఆరో ముఖ్యమంత్రిగా షీలాదీక్షిత్‌ సేవలందించారు. వయస్సులో షీలాదీక్షిత్‌ కంటే సుష్మా 14 ఏళ్లు చిన్నది. 1998లో ఢిల్లీ ఎన్నికలకు 40 రోజుల ముందు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన సుష్మా.. అకస్మాత్తుగా పెరిగిన ఉల్లిగడ్డల ధర కారణంగా ఓటమి చవిచూశారు.