AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

థాయిలాండ్ నుంచి స్వదేశానికి బయలుదేరిన 153 మంది భారతీయులు

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'వందే భారత్ మిషన్'‌‌ చురుక్కుగా సాగుతుంది. కరోనా నేపథ్యంలో థాయ్‌లాండ్‌లో చిక్కుకుపోయిన 153 మంది భారతీయులు మంగళవారం 'వందే భారత్ మిషన్'‌‌లో భాగంగా ప్రత్యేక ఎయిరిండియా విమానంలో స్వదేశానికి బయల్దేరారు.

థాయిలాండ్ నుంచి స్వదేశానికి బయలుదేరిన 153 మంది భారతీయులు
Balaraju Goud
|

Updated on: Sep 02, 2020 | 3:40 PM

Share

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘వందే భారత్ మిషన్’‌‌ చురుక్కుగా సాగుతుంది. కరోనా నేపథ్యంలో థాయ్‌లాండ్‌లో చిక్కుకుపోయిన 153 మంది భారతీయులు మంగళవారం ‘వందే భారత్ మిషన్’‌‌లో భాగంగా ప్రత్యేక ఎయిరిండియా విమానంలో స్వదేశానికి బయల్దేరారు. ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా స్పందించిన థాయ్‌లాండ్‌లోని భారత ఎంబసీ… “వందే భారత్ మిషన్‌లో భాగంగా ఇది థాయ్‌లాండ్ నుంచి ఇండియాకు వస్తున్న 12వ విమానం అని స్పష్టం చేశారు. ఏఐ 335 విమానం మంగళవారం బ్యాంకాక్ నుంచి ఢిల్లీకి 153 ప్రయాణికులతో బయల్దేరింది. ప్రవాసుల తరలింపులో సహకరిస్తున్న థాయ్‌లాండ్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, థాయ్ ఇమ్మిగ్రేషన్, విదేశాంగ మంత్రిత్వ శాఖ, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, ఎయిర్ ఇండియాకు ప్రత్యేక ధన్యవాదాలు” అని పేర్కొంది.

కాగా, కరోనా వల్ల విదేశాల్లో చిక్కుకున్న భారత ప్రవాసులను స్వదేశానికి తరలించేందుకు కేంద్రం మే 6న ‘వందే భారత్ మిషన్‌’ కార్యక్రమాన్ని ను ప్రారంభించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆగస్టు 30వ తేదీ వరకు ఈ మిషన్ ద్వారా వివిధ దేశాల నుంచి 12,60,118 మంది భారతీయులను స్వదేశానికి తరలించడం జరిగిందని తాజాగా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు వీబీఎం ఐదు దశలు పూర్తి చేసుకుని… సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఆరో విడతలోకి అడుగు పెట్టింది. ఈ ఆరో దశలో కూడా సాధ్యమైనంత వరకు విదేశాల్లో చిక్కుకున్న భారత ప్రవాసులను స్వదేశానికి తీసుకొస్తామని ఈ సందర్భంగా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది.

Follow Us
అరుదైన ఘట్టానికి కౌంట్‌ డౌన్‌.. వెలిగొండకు కృష్ణా జలాలు..
అరుదైన ఘట్టానికి కౌంట్‌ డౌన్‌.. వెలిగొండకు కృష్ణా జలాలు..
రాకా సినిమాలో టాలీవుడ్ గోల్డెన్ బ్యూటీ.. సెప్టెంబర్‏లో షూటింగ్..
రాకా సినిమాలో టాలీవుడ్ గోల్డెన్ బ్యూటీ.. సెప్టెంబర్‏లో షూటింగ్..
మటన్‌లోని ఈ పార్ట్ మోస్ట్ పవర్‌ఫుల్.. తింటే ఆ రోగాల మాటే ఉండదు..
మటన్‌లోని ఈ పార్ట్ మోస్ట్ పవర్‌ఫుల్.. తింటే ఆ రోగాల మాటే ఉండదు..
రూ.500 నోటు అసలుదా? నకిలీదా? ఈ 3 సీక్రెట్ ఫీచర్లతో గుర్తించండి!
రూ.500 నోటు అసలుదా? నకిలీదా? ఈ 3 సీక్రెట్ ఫీచర్లతో గుర్తించండి!
ఇది ఒక్కటి తిన్న చాలు.. జీవితంలో డయాబెటీస్ రాదు!
ఇది ఒక్కటి తిన్న చాలు.. జీవితంలో డయాబెటీస్ రాదు!
గోధుమ పిండి లడ్డూ.. ఒక్కటి తిన్నా తిరుగులేని బలం మీ సొంతం
గోధుమ పిండి లడ్డూ.. ఒక్కటి తిన్నా తిరుగులేని బలం మీ సొంతం
తియ్య తియ్యని బాదుషా.. ఇంట్లోనే సింపుల్‌గా ఎలా చేయాలో తెలుసా?
తియ్య తియ్యని బాదుషా.. ఇంట్లోనే సింపుల్‌గా ఎలా చేయాలో తెలుసా?
విజయానికి 4 పరుగులు.. కట్‌చేస్తే.. మ్యాచ్‌ ఆపేసిన అంపైర్లు
విజయానికి 4 పరుగులు.. కట్‌చేస్తే.. మ్యాచ్‌ ఆపేసిన అంపైర్లు
ఈ చెట్టుకి డబ్బులు కాస్తాయి.. నిజాయితీ పరుడైన రైతు కథ!
ఈ చెట్టుకి డబ్బులు కాస్తాయి.. నిజాయితీ పరుడైన రైతు కథ!
కేక్ కట్ చేసి క్యాండిల్స్ ఎందుకు ఊదుతాం..? 99శాతం మందికి తెలియని
కేక్ కట్ చేసి క్యాండిల్స్ ఎందుకు ఊదుతాం..? 99శాతం మందికి తెలియని