Story Of Padma Awardee: మంత్రగత్తె అంటూ ఇంటి నుంచి గెంటేస్తే.. అడవిలో నలుగురి పిల్లలతో గడిపిన మహిళ.. నేడు పద్మశ్రీ అవార్డు గ్రహీత

|

Aug 02, 2022 | 9:40 PM

దేవిని ఒకప్పుడు మంత్రగత్తె అంటూ కుటుంబ సభ్యులు ఇంటి నుండి గెంటివేశారు. ఆమె దైర్యం కోల్పోకుండా నలుగురు పిల్లలతో అడవిలో బతకడం ప్రారంభించింది. అంతేకాదు తనలాంటి ఇతర మహిళకు అండగా ఉండడం కోసం ఓ సంస్థను ఏర్పాటు చేశారు.

Story Of Padma Awardee: మంత్రగత్తె అంటూ ఇంటి నుంచి గెంటేస్తే.. అడవిలో నలుగురి పిల్లలతో గడిపిన మహిళ.. నేడు పద్మశ్రీ అవార్డు గ్రహీత
Story Of Padma Awardee Devi
Follow us on

Story Of Padma Awardee: దేశంలో మహిళలు అంబరాన్ని అందుకుంటున్నారు. ఆర్ధికంగా బలపడుతున్నారు.. తాము బతుకుతూ..మరో కొందరి మహిళలకు సహాయం చేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ మహిళలలో చాలా మార్పులు వచ్చింది. కొందరు మహిళలు సమాజంతో పాటు దేశంలోని మహిళలకు ఆదర్శంగా  నిలుస్తున్నారు. అలాంటి ఆదర్శ మహిళలకు సమాజం గుర్తింపుతో పాటు ప్రభుత్వం కూడా గుర్తింపు లభిస్తుంది. 2020లో దేశంలోని నాల్గవ అత్యున్నత పురస్కారం జార్ఖండ్ కు చెందిన దేవి అనే మహిళ అందుకున్నారు. దేవిని ఒకప్పుడు మంత్రగత్తె అంటూ కుటుంబ సభ్యులు ఇంటి నుండి గెంటివేశారు. ఆమె దైర్యం కోల్పోకుండా నలుగురు పిల్లలతో అడవిలో బతకడం ప్రారంభించింది. అంతేకాదు తనలాంటి ఇతర మహిళకు అండగా ఉండడం కోసం ఓ సంస్థను ఏర్పాటు చేశారు. తంత్ర మంత్రగత్తెలంటూ సమాజం నుంచి వెలివేయబడిన  బాధితులకు అండగా నిలిచారు. ఆదర్శంగా నిలిచారు. ఇప్పటి వరకు వందలాది మంది మహిళల ముఖాల్లో ఆనందాన్ని నింపారు.

మంత్రగత్తె అని చెప్పి ఇంటి నుంచి గెంటేసిన కుటుంబ సభ్యులు.
చుట్నీ దేవి జార్ఖండ్‌లోని ఖర్సావాన్ జిల్లా దుమారియా బ్లాక్‌లోని విర్వార్ పంచాయతీ నివాసి. చుట్నీ దేవి వయస్సు 62 సంవత్సరాలు. ఆమెకు 2020లో పద్మశ్రీ అవార్డు లభించింది. ఆమె అసోసియేషన్ ఫర్ సోషల్ అండ్ హ్యూమన్ అవేర్‌నెస్ పేరుతో ఒక సంస్థను నడుపుతున్నారు. 1995లో చుట్నీ దేవికి వివాహం జరిగింది. పెళ్లయిన 16 సంవత్సరాల తర్వాత కుటుంబ సభ్యులు దేవిని మంత్రగత్తె అంటూ ఇంటి నుంచి గెంటేశారు. దీంతో ఆమె తన 4 పిల్లలతో కలిసి అడవిలో నివసించింది.అనేక వేధింపులకు గురైంది. అయినప్పటికీ ఆమె తన ధైర్యం కోల్పోలేదు. తనకు వచ్చిన కళంకంపై పోరాడాలని నిశ్చయించుకున్నారు. మొదట్లో 70 మంది మహిళలతో ఓ సంస్థను ఏర్పాటు చేసి.. ఆ తర్వాత తనలాంటి మహిళలకు అండగా నిలిచారు. ఇప్పటి వరకూ దేవి 100 మందికి పైగా మహిళలకు న్యాయం జరిగేలా చూశారు దేవి.

ఇవి కూడా చదవండి

స్త్రీలకు చుట్నీ దేవి ఆసరా
చుట్నీ దేవిని మంత్రగత్తె అని ఇంటి నుండి గెంటేయడమే కాదు.. అనేక చిత్రహింసలు పడింది, దీంతో తనకులా మారె స్త్రీ వేధింపులకు గురికాకూడని భావించింది. అందుకే ఆమె ఆశా సంస్థ సాయంతో తనలాంటి బాధిత మహిళల కోసం పోరాడుతుంది. నేడు మహిళల గౌరవం కోసం ఆమె చేస్తున్న పోరాటం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. పద్మశ్రీ అవార్డు రావడంతో జార్ఖండ్ ముఖ్యమంత్రి స్వయంగా అభినందించారు. జార్ఖండ్‌కు చెందిన చుట్నీ దేవికి 2021లో పద్మశ్రీ అవార్డు కోసం PMO నుండి కాల్ వచ్చినప్పుడు, 1 గంట తర్వాత కాల్ చేయమని, తాను బిజీగా ఉన్నానని చెప్పారు. పద్మశ్రీ అవార్డు గురించి అప్పట్లో చుట్నీ దేవికి తెలియదు.  ఈ సన్మానం ప్రభుత్వం చేస్తుందని ఫోన్‌లో చెప్పి.. అనంతరం చుట్నీ దేవికి చెప్పి ఒప్పించారు.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..