హోటళ్లు, దైవ దర్శనాలు.. కర్ణాటక అసంతృప్త ఎమ్మెల్యేల ముంబాయి టూర్

| Edited By:

Jul 13, 2019 | 1:44 PM

అనూహ్య మలుపులు తిరుగుతోంది కర్ణాటక రాజకీయం. ఊహించని ట్విస్టులతో సాగిన కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేల రాజీనామాల వ్యవహారం సుప్రీం కోర్టు ఆదేశాలతో ఆగినట్టయ్యింది. చివరికి అసెంబ్లీలో తన బలమెంతో నిరూపించుకుంటానని స్పీకర్ రమేష్‌కుమార్‌కు సీఎం కుమారస్వామి లేఖ ఇచ్చారు. దీంతో పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. ఇదిలా ఉంటే బలపరీక్ష నెగ్గాలంటే ఇప్పటికే అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలంతా మళ్లీ సంకీర్ణ ప్రభుత్వానికే ఓటు వేయాల్సి ఉంటుంది. దీంతో శనివారం తెల్లవారుజామున కాంగ్రెస్ మంత్రి డీకే శివకుమార్ నేతృత్వంలో […]

హోటళ్లు, దైవ దర్శనాలు.. కర్ణాటక అసంతృప్త ఎమ్మెల్యేల ముంబాయి టూర్
Follow us on

అనూహ్య మలుపులు తిరుగుతోంది కర్ణాటక రాజకీయం. ఊహించని ట్విస్టులతో సాగిన కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేల రాజీనామాల వ్యవహారం సుప్రీం కోర్టు ఆదేశాలతో ఆగినట్టయ్యింది. చివరికి అసెంబ్లీలో తన బలమెంతో నిరూపించుకుంటానని స్పీకర్ రమేష్‌కుమార్‌కు సీఎం కుమారస్వామి లేఖ ఇచ్చారు. దీంతో పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది.

ఇదిలా ఉంటే బలపరీక్ష నెగ్గాలంటే ఇప్పటికే అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలంతా మళ్లీ సంకీర్ణ ప్రభుత్వానికే ఓటు వేయాల్సి ఉంటుంది. దీంతో శనివారం తెల్లవారుజామున కాంగ్రెస్ మంత్రి డీకే శివకుమార్ నేతృత్వంలో అసంతృప్త ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. దీనికి అనుగుణంగా ఎమ్మెల్యే రామలింగారెడ్డి వర్గం, ఆయన కుమార్తె సౌమ్యా రెడ్డితో శివకుమార్ మాట్లాడారు. అటు తర్వాత పలువురు ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి వారిని బుజ్జగించి.. ఇప్పటికే ఇచ్చిన రాజీనామాలను వెనక్కి తీసుకోవాలని కోరారు.

ఇదిలా ఉంటే కాంగ్రెస్, బీజేపీలు తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో భాగంగా రిసార్టులకు తరలిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ముంబాయిలో ఉన్నారు. వీరంతా పనిలోపనిగా పలు దేవాలయాలను సందర్శిస్తూ బిజీగా ఉన్నారు. అయితే ముంబాయిలో ఉన్న ఎమ్మెల్యేలను బెంగళూరుకు రావాలని శివకుమార్ వారికి విఙ్ఞప్తి చేశారు.