SSC CHSL 2023 Last Date: ఇంటర్ అర్హతతో 1600 కేంద్ర కొలువులకు దరఖాస్తు చేసుకున్నారా? రేపటితో ముగుస్తోన్న గడువు..

ఇంటర్‌ అర్హతతో కేంద్ర కొలువులు సొంతం చేసుకోవడానికి చివరి అవకాశం. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌లో ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ రేపటితో ముగియనుంది. దాదాపు 1600 లోయర్‌ డివిజనల్‌ క్లర్క్, జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్ పోస్టులకు..

SSC CHSL 2023 Last Date: ఇంటర్ అర్హతతో 1600 కేంద్ర కొలువులకు దరఖాస్తు చేసుకున్నారా? రేపటితో ముగుస్తోన్న గడువు..
SSC CHSL 2023

Updated on: Jun 07, 2023 | 3:49 PM

ఇంటర్‌ అర్హతతో కేంద్ర కొలువులు సొంతం చేసుకోవడానికి చివరి అవకాశం. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌లో ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ రేపటితో ముగియనుంది. దాదాపు 1600 లోయర్‌ డివిజనల్‌ క్లర్క్, జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్‌ (గ్రేడ్‌-ఎ) పోస్టుల భర్తీకి ఎస్సెస్సీ ఇటీవల 2023-24 సంవత్సరానికిగానూ ‘కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌ ఎగ్జామినేషన్‌-2023 (సీహెచ్‌ఎస్‌ఎల్‌) నోటిఫికేషన్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఇంటర్‌ పాసైన వారు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో జూన్‌ 8, 2023వ తేదీ రాత్రి 11 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓపెన్‌ స్కూల్‌ ద్వారా చదివినవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియాలో డేటా ఎంట్రీ పోస్టులకు మాత్రం ఇంటర్‌లో సైన్స్‌ గ్రూప్‌తో తప్పనిసరిగా మ్యాథ్స్‌ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. అలాగే దరఖాస్తుదారుల వయసు ఆగస్టు 1. 2023 నాటికి 18-27 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు ఫీజు కింద జనరల్‌ అభ్యర్ధులు రూ.100 చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఎటువంటి ఫీజు లేదు. టైర్‌-1, టైర్‌-2 ఆన్‌లైన్‌ పరీక్షల ద్వారా ఎంపిక చేస్తారు. జూన్‌ 14 నుంచి జనవరి 15 వరకు అప్లికేషన్‌లో ఎవైనా తప్పులు దొర్లితే సవరణకు అవకావం ఉంటుంది. టైర్‌-1 రాత పరీక్ష ఆగస్టులో ఉంటుంది. టైర్‌-2 డిస్క్రిప్టివ్‌ పరీక్ష ఎప్పుడనేది తర్వాత ప్రకటిస్తారు. ఎంపికైతే రూ.19,900ల నుంచి రూ.92,300ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.

అధికారిక వెబ్‌సైట్ కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.