స్పైస్ జెట్ విమానంలో టెక్నీషియన్ ప్రమాదవశాత్తూ మరణించడంతో సంస్ధ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. స్పైస్‌జెట్ విమానయాన సంస్థలో టెక్నీషియన్‌గా విధులు నిర్వహిస్తున్న రోహిత్ పాండే.. క్యూ400 విమానంలో మెయింటెనెన్స్ పనులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం అర్ధరాత్రి సడెన్‌గా ల్యాండింగ్ గ్యేర్ హైడ్రాలిక్ డోర్ మూసుకుపోవడంతో అందులో చిక్కుకుని రోహిత్ మరణించాడు.
ఈ ఘటనపై స్పైస్‌జెట్ విచారం వ్యక్తం చేసింది. ఈ ప్రమాదం హైడ్రాలిక్ డోర్స్ మూసుకుపోవడం వల్లే సంభవించిందని ఓ ప్రకటనలో తెలిపింది. అగ్నిమాపక సిబ్బంది సహకారంతో రోహిత్ మృతదేహాన్ని విమానం నుంచి వెలుపలికి తీసుకువచ్చామని తెలిపారు. మరోవైపు రోహిత్ పాండే మృతిపై కోల్‌కతా పోలీసులు అసహజ మరణం కింది కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.