అక్కడ టాయిలెట్ బ్రాహ్మణులకు మాత్రమేనట..!

|

Mar 07, 2020 | 1:47 PM

ఈ మరుగుదొడ్డి బ్రాహ్మణులకు మాత్రమే అని రాసిన బోర్డును వివాదాలకు దారితీసింది. ప్రముఖ దేవాలయంలో మూడో కేటగిరీతో బ్రాహ్మణుల కోసం స్పెషల్​ టాయిలెట్​ ఏర్పాటు చేయటంపై వివాదం రాజుకుంది..

అక్కడ టాయిలెట్ బ్రాహ్మణులకు మాత్రమేనట..!
Follow us on

మన దేశంలో మనిషి పుట్టింది మొదలు..చనిపోయే వరకు వీడని నీడలా అంటిపెట్టుకుని ఉండేది కులం ఒక్కటే అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు..ఎందుకంటే..నేటి ఆదునిక సమాజంలోనూ ఇంకా చాలా మంది కుల పిచ్చిలోనే మునిగిపోయి ఉన్నారు.
పుట్టిన పాపాయిని చూడ్డానికొచ్చే బంధువులు, స్నేహితుల కంటే ముందే బర్త్‌ సర్టిఫికెట్‌ రూపంలో కులం, మతం వచ్చి చేరుతాయి. అలాగే, మనిషి మరణించాక కూడా అవి వదిలిపెట్టవు. డెత్‌ సర్టిఫికెట్‌ రూపంలో చాలా భద్రంగా ఉంటాయి. ఇందుకు ప్రతక్ష్య ఉదాహరణగా నిలిచే సంఘటన ఒకటి కేరళ రాష్ట్రంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే…

ఇప్పటివరకు ఇల్లు అద్దెకు ఇవ్వడానికి,పెళ్లి చేయడానికి మాత్రమే అడిగే ఈ కుల ప్రస్తావన ఇప్పుడు మరుగుదొడ్డి వాడే విషయం లో కూడా కులం ప్రస్తావన వస్తుండడం గమనార్హం. కేరళలో కొందరు కుల పిచ్చోళ్లు ఒక అడుగు ముందుకు వేసి ‘ఈ మరుగుదొడ్డి బ్రాహ్మణులకు మాత్రమే అని రాసిన బోర్డును ఏర్పాటు చేశారు. థ్రిచూర్​లో ఉన్న కుట్టుముక్కు శివాలయంలో మూడో కేటగిరీతో ఓ టాయిలెట్​ కట్టించారు. బ్రాహ్మణుల కోసం స్పెషల్​ టాయిలెట్​ ఏర్పాటు చేయటంపై వివాదం రాజుకుంది. దానిని ఫోటో తీసిన కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో రచ్చ చోటు చేసుకుంది. దీంతో వెంటనే ఆ బోర్డును తొలగించేశారు.. దీనిపై ఇంకో వివాదమూ రాజుకుంది. అసలు ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​ అవుతున్న ఆ ఫొటో ఇప్పుడు తీసింది కాదని, పాతదానిని పెట్టి రచ్చ చేస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. గుళ్లో ఎవరికీ అంటరానితనం అన్న భావనే లేదని, అందరినీ సమానంగా చూస్తారని చెబుతున్నారు. ఆ మూడో టాయిలెట్​ను కేవలం గుళ్లో పనిచేసే పూజారులు మాత్రమే వాడుతుంటారని, మిగతా రెండు భక్తుల కోసమని వాదిస్తున్నారు. దీంతో ఆలయ నిర్వాహకులు విచారణకు ఆదేశించారు. దేవుడు అందరినీ సమానంగా చూస్తాడు కదా, మరి ఆయన సన్నిధిలోనే ఈ వివక్షేంటి అంటూ నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.