యూపీ ఎన్నికల్లో ఆప్, ఎస్పీల పొత్తు ..? సంజయ్ సింగ్ ని కలిసిన అఖిలేష్ యాదవ్.. ఇప్పటినుంచే చేతులు కలుపుతున్న నేతలు

| Edited By: Phani CH

Jul 04, 2021 | 6:53 PM

యూపీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనుండగా సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ ఆదివారం ఢిల్లీలో ఆప్ నేత, ఎంపీ సంజయ్ సింగ్ తో భేటీ అయ్యారు.

యూపీ ఎన్నికల్లో ఆప్, ఎస్పీల పొత్తు ..? సంజయ్ సింగ్ ని కలిసిన అఖిలేష్ యాదవ్.. ఇప్పటినుంచే చేతులు కలుపుతున్న నేతలు
Akhilesh Yadav
Follow us on

యూపీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనుండగా సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ ఆదివారం ఢిల్లీలో ఆప్ నేత, ఎంపీ సంజయ్ సింగ్ తో భేటీ అయ్యారు. దీంతో ఈ పార్టీల మధ్య పొత్తు కుదరవచ్చునన్న ఊహాగానాలు బలం పుంజుకుంటున్నాయి. కాగా తాము బీజేపీ అనుసరిస్తున్న అణచివేత విధానాల గురించి చర్చించుకున్నామని సంజయ్ సింగ్ ఆ తరువాత తెలిపారు. ఉత్తరప్రదేశ్ లో జరిగిన జిల్లా పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. అయితే ఆ పార్టీ ఓటర్లను కిడ్నాప్ చేసిందని, ఓటింగ్ లో వారు పాల్గొనకుండా అడ్డుకుందని అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. తన ఓటమిని గెలుపుగా మార్చుకునేందుకు పోలీసులను ఉపయోగించుకుని ఓటర్లను కిడ్నాప్ చేసిందన్నారు. అన్ని ప్రజాస్వామ్య విలువలను ఆ పార్టీ అపహాస్యం చేసిందన్నారు. అటు సంజయ్ సింగ్ కూడా ఈ ఆరోపణలతో ఏకీభవిస్తూ..ఆ పార్టీ లోక్ తంత్రను (ప్రజాస్వామ్యాన్ని) లూట్ తంత్ర (లూటింగ్) గా మార్చిందన్నారు .. యూపీ జిల్లా పంచాయతీ ఎన్నికల్లో ఇదే రుజువైందని ఆయన ట్వీట్ చేశారు.

ఆ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ కేవలం 5 స్థానాలను గెలుచుకోగా.. రాష్ట్రీయ లోక్ దళ్, జనతాదళ్, ఓ ఇండిపెండెంట్ అభ్యర్థి ఒక్కొక్క స్థానాన్ని గెలుచుకున్నారు. బీజేపీ 67 స్థానాల్లో విజయం సాధించింది. మొత్త్తం 75 సీట్లకు ఎన్నికలు జరిగాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికలను ఈ ఫలితాలు ప్రతిబించాయని.. ఆ ఎన్నికల్లో కూడా తమదే విజయమని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించిన సంగతి విదితమే.. అయితే ఇటీవలి వరకు తాము ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని ప్రకటించిన అఖిలేష్ యాదవ్ తీరు మారినట్టు కనిపిస్తోంది. అందుకే ఆయన ఆప్ శరణు జొచ్చారా అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Funny Video: పాపం.. పాప పానీపూరి లాగేసుకున్నాడు.. మరి అమ్మాయి ఏం చేసిందో చూస్తే కడుపుబ్బా నవ్వాల్సిందే..

Telangana: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ సర్కార్ లేఖ