నిలకడగా బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం

గాన గంధర్వుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రి పేర్కొంది. ఈ మేరకు ఎంజీఎం ఆసుపత్రి మేనేజ్‌మెంట్ తాజాగా హెల్త్ బులెటిన్‌ విడుదల చేసింది.

నిలకడగా బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం

Updated on: Aug 21, 2020 | 6:12 PM

గాన గంధర్వుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రి పేర్కొంది. ఈ మేరకు ఎంజీఎం ఆసుపత్రి మేనేజ్‌మెంట్ తాజాగా హెల్త్ బులెటిన్‌ విడుదల చేసింది. ఆగస్టు 5న బాలుకు కరోనావైరస్ పాజిటివ్ గా తేలడంతో చికిత్స నిమిత్తం ఆయన ఎంజీఎం ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మరో రెండు రోజులకు ఆయన ఆరోగ్యం కాస్త క్షీణించడంతో.. ఐసీయూలోకి మార్చి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్టు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

కాగా, ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో ఎంజిఎం హాస్పిటల్ పేర్కొంది. ఐసీయూలో వెంటిలేటర్‌పై ఎక్మో సపోర్ట్‌తో చికిత్స అందిస్తున్నట్టుగా వెల్లడించిన ఆసుపత్రి.. మెరుగైన వైద్యం కోసం జాతీయ, అంతర్జాతీయ నిపుణులైన డాక్టర్లను సంప్రదిస్తున్నట్లుగా తెలిపారు. బాలు ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు కుటుంబసభ్యులకు సమాచారం అందిస్తున్నట్లు ఆస్పత్రి ప్రతినిధి అనురాధ భాస్కరన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని వేడుకుంటూ ఆయన అభిమానులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు.