Southwest Monsoon: నైరుతి రుతుపవనాలు మే 31 నాటికి కేరళను తాకే అవకాశం: భారత వాతావరణ శాఖ

Southwest Monsoon: రైతులకు శుభవార్త రాబోతోంది. ఈనెల 31వ తేదీ వరకు నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది..

Southwest Monsoon: నైరుతి రుతుపవనాలు మే 31 నాటికి కేరళను తాకే అవకాశం: భారత వాతావరణ శాఖ
Southwest Monsoon

Updated on: May 28, 2021 | 10:18 AM

Southwest Monsoon: రైతులకు శుభవార్త రాబోతోంది. ఈనెల 31వ తేదీ వరకు నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. మాల్దీవ్‌ కొమొరిన్‌ రీజియన్‌ ప్రాంతంలో పవనాలు వేగవంతం అయ్యాయని తెలిపింది. రుతుపవనాలకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతున్న తరుణంలో కేరళలోని చాలా ప్రాంతాల్లో వారం రోజులుగా స్వల్ప వర్షాలు కురుస్తున్నాయి. జమ్మూకశ్మీర్‌, ఈశాన్య రాష్ట్రాలు లఢక్‌ మినహా కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రస్తుతం ప్రీ మాన్సూన్‌ సీజన్‌లో సాధారణం కంటే అధిక వర్షాపాతం నమోదైంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే మే 31 వరకు రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. కాగా, అరేబియా సముద్రం, బెంగల్‌లో రెండు వారాల్లో తౌక్టే, యాస్‌ తుఫాన్లు ముంచెత్తాయి. ఈ రెండు తుఫాన్ల కారణంగా దేశంలో భారీగా వర్షాపాతం నమోదైంది.

ఇవీ చదవండి:

Good News: కోవిడ్ పై పోరాటంలో మరింత పురోగతి.. కరోనా రోగులకు సరికొత్త చికిత్స.. పాజిటివ్ స్టోరీలు మీ కోసం

Suravaram : ఆత్మగౌరవ పతాకాన్ని ఎగరేసి.. సాహితీ వైభవాన్ని నిరూపించిన అచ్చమైన తెలంగాణవాది.. స్ఫూర్తిని రగిలించిన తేజోమూర్తి శ్రీ సురవరం : సీఎం