
కరోనా నేపథ్యంలో వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు దక్షిణ మధ్య రైల్వే మరిన్ని చర్యలు తీసుకోబోతోంది. రైలు ప్రయాణాన్ని మరింత సురక్షితం చేసే ఆలోచనలో ఉన్న దక్షిణ మధ్య రైల్వే.. తాజాగా మరో వినూత్న ప్రయోగం చేయబోతోంది. ఆటోమాటిక్ బుల్లెట్ థర్మల్ స్క్రీనింగ్ ఇమేజ్ డిటెక్ట్ కెమెరాలు అధికారులు ఏర్పాటు చేయబోతున్నారు. సికింద్రాబాద్, హైదరాబాద్ రైల్వే స్టేషన్‌లో తొలిసారిగా అధికారులు ప్రయోగించబోతున్నారు. దీని వలన ధర్మల్ స్క్రీనింగ్ కోసం ప్రతి వ్యక్తిని నేరుగా చెక్ చేసే పద్దతి బ్రేక్ పడనుంది.
ఈ కొత్త టెక్నాలజీ వలన ఒకేసారి 10 మందికి శరీర ఉష్ణోగ్రతలు తెలుసుకోవచ్చు. శరీర ఉష్ణోగ్రతల్లో తేడా ఉంటే.. వెంటనే అలారమ్ మోగనుంది. అలాగే డిటెక్ట్ చేసిన వ్యక్తుల వివరాలు నెల రోజుల పాటు నిక్షిప్తం చేసే అవకాశం ఉంటుంది. రైల్వేలో ప్రయాణించే కరోనా పేషంట్లను గుర్తించేందుకే ఇది ఉత్తమ పద్దతని అధికారులు చెబుతున్నారు. రద్దీగా మారుతున్న సమయంలో ఆధునిక టెక్నాలజీని అత్యంత ఉపయోగమని రైల్వే సీపీఆర్‌వో రాకేష్ తెలిపారు.
Read This Story Also: పూరీనో, ఇడ్లీనో.. మోక్షజ్ఙ ఎంట్రీపై బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు..!