Sourav Ganguly: ‘దాదా’కి జెడ్ కేటగిరీ భద్రత.. స్వతహాగా కల్పించిన వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం.. కారణం ఏమిటంటే..?

|

May 18, 2023 | 5:55 AM

బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ సెక్యూరిటీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది బెంగాల్ సర్కార్‌. గంగూలీ భద్రతను Z కేటగిరీకి అప్‌గ్రేడ్ చేసింది దీదీ ప్రభుత్వం. టీమిండియా మాజీ కెప్టెన్‌, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీకి భద్రతను పెంచాలని పశ్చిమబెంగాల్‌..

Sourav Ganguly: ‘దాదా’కి జెడ్ కేటగిరీ భద్రత.. స్వతహాగా కల్పించిన వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం.. కారణం ఏమిటంటే..?
Saurav Ganguly
Follow us on

బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ సెక్యూరిటీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది బెంగాల్ సర్కార్‌. గంగూలీ భద్రతను Z కేటగిరీకి అప్‌గ్రేడ్ చేసింది దీదీ ప్రభుత్వం. టీమిండియా మాజీ కెప్టెన్‌, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీకి భద్రతను పెంచాలని పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం నిర్ణయించింది. గంగూలీ భద్రతను జెడ్ కేటగిరీకి పెంచింది బెంగాల్ ప్రభుత్వం. ఈ విషయాన్ని అక్కడ ప్రభుత్వ అధికారి వెల్లడించారు. ఇప్పటి వరకూ గంగూలీకి వై కేటగిరీ సెక్యూరిటీ ప్రొటెక్షన్ ఉండగా.. ఆ గడువు ముగియడంతో.. భద్రతను మరింత పెంచాలని మమతా బెనర్జీ సర్కారు నిర్ణయించింది. ఇకపై గంగూలీకి 8 నుంచి 10 మంది పోలీసులు అన్ని వేళలా రక్షణగా ఉంటారు.

అయితే తనకు భద్రత పెంచాలని గంగూలీ కోరనప్పటికీ.. అతడికి మరింత భద్రత అవసరమని ప్రభుత్వమే భావించినట్లు తెలుస్తోంది. వీవీఐపీల సెక్యూరిటీ గడువు ముగియడంతో.. సమీక్ష జరిపిన అధికారులు గంగూలీ సెక్యూరిటీని జెడ్ కేటగిరీకి పెంచాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు గంగూలీకి స్పెషల్ బ్రాంచ్ నుంచి ముగ్గురు పోలీసు అధికారులు రక్షణ కల్పించగా.. లాన్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు చెందిన మరో ముగ్గురు అధికారులు ఆయన నివాసం వద్ద కాపలా ఉంటున్నారు. ఢిల్లీ డేర్‌డెవిల్స్ క్రికెట్ డైరెక్టర్‌గా ఉన్న దాదా.. మే 21న కోల్‌కతాకు తిరిగొస్తాడు.

కాగా, అప్పటి నుంచి అతడికి జెడ్ కేటగిరీ రక్షణ కల్పించనున్నట్లు బెంగాల్ ప్రభుత్వ అధికారులు తెలిపారు. బెంగాల్‌లో సీఎం మమతా బెనర్జీ, గవర్నర్ సీవీ ఆనంద బోస్, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీకి జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉంది. వెస్ట్ బెంగాల్లో పలువురు మంత్రులకు ఉండే సెక్యూరిటీ ఇక నుంచి గంగూలీకి కూడా ఉండనుంది. సాధారణంగా దాడి జరగొచ్చనే ఇంటెలిజెన్స్ సమాచారం ఉన్నప్పుడు లేదా ముప్పు ఎక్కువగా ఉన్నప్పుడు భద్రతను పెంచుతారు. ఇప్పుడు గంగూలీకి భద్రతను పెంచడాన్ని బట్టి అతడికి ఏదైనా ముప్పు ఉందా..? అనే అనుమానం తలెత్తుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..