‘భాయ్ ! 10 నిముషాల్లో….’కోవిడ్ తరుణంలో సురేష్ రైనాకు సాయపడిన ‘ఆపద్బాంధవుడు’ సోను సూద్

ఈ కోవిడ్ సంక్షోభ సమయంలో క్రికెటర్ సురేష్ రైనాకు సాయపడ్డాడు 'ఆపద్బాంధవుడు' సోను సూద్ ! యూపీలోని మీరట్ లో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన బంధువైన మహిళకు అత్యవసరంగా ఆక్సిజన్ సిలిండర్ కావాలంటూ సురేష్ రైనా..

'భాయ్ ! 10 నిముషాల్లో....'కోవిడ్ తరుణంలో సురేష్  రైనాకు సాయపడిన 'ఆపద్బాంధవుడు' సోను సూద్
Sonu Sood Helps Cricketer Suresh Raina
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: May 06, 2021 | 9:57 PM

ఈ కోవిడ్ సంక్షోభ సమయంలో క్రికెటర్ సురేష్ రైనాకు సాయపడ్డాడు ‘ఆపద్బాంధవుడు’ సోను సూద్ ! యూపీలోని మీరట్ లో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన బంధువైన మహిళకు అత్యవసరంగా ఆక్సిజన్ సిలిండర్ కావాలంటూ సురేష్ రైనా ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ ని ఉద్దేశించి ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ చూసిన సోను..సురేష్ రైనా నుంచి వివరాలు కోరాడు. ఆ వెంటనే ‘ అరె ! భాయ్ !10 నిముషాల్లో ఆక్సిజన్ సిలిండర్ ని ఏర్పాటు చేస్తానంటూ’ ట్వీట్ చేశాడు. అన్నట్టే ఇంత తక్కువ సమయంలో తన హామీ నెరవేర్చాడు. సురేష్ రైనాకు వరుసకు అత్త అయ్యే 65 ఏళ్ళ మహిళ మీరట్ లోని హాస్పిటల్ లో చికిత్స పొందుతోంది. లంగ్ ఇన్ఫెక్షన్ తో బాధ పడుతున్న ఆమెకు ఆక్సిజన్ సిలిండర్ అవసరమైంది. కానీ ఈ కోవిడ్ సమయంలో ఈ ప్రాణవాయువు కొరత తీవ్రంగా ఉంది. ఇలాంటప్పడు సోను సూద్ సురేష్ రైనాకు అండగా నిలిచాడు. ఈ తరుణంలో ఎవరికి , ఏ సహాయం అవసరమైనా మీకు నేనున్నానంటూ సోను సూద్ ఆపన్న హస్తం అందిస్తున్నాడు. ఇటీవల కరోనా వైరస్ పాజిటివ్ కి గురైన సోను పూర్తిగా కోలుకున్నాడు. సొషల్ మీడియాలో సదా యాక్టివ్ గా ఉండే ఈ నటుడు ఇప్పటివరకు కొన్ని వేలమందికి సహాయం చేశాడు. పరోక్షంగా, ప్రత్యక్షంగా ఈ ఆపద్బాంధవుడు చేసే సాయానికి ఇతడిని అభినందించని వారు లేరు. కోవిద్ బాధితుల కోసం చైనా నుంచి సోను సూద్ కొన్ని వందల ఆక్సిజన్ సిలిండర్లను తెప్పించే యత్నంలో ఉన్నాడు. అయితే తన ఆర్దర్లను అక్కడి అధికారులు అడ్దకున్నారని, వాటిని వెంటనే పంపాలని ట్వీట్ చేశాడు. దీంతో భారత్ లోని చైనా రాయబారి వెంటనే స్పందించి అవి తక్షణమే ఇండియాకు చేరేలా చూస్తానని హామీ ఇచ్చారు.

మరిన్ని ఇక్కడ చూడండి: మరో విషాదం.. కరోనా సోకి ప్రముఖ నటి మృతి.. సంతాపం ప్రకటించిన పలువురు సినీ ప్రముఖులు..

Alleges Molestation: బాబా ముసుగులో ఆగడాలు.. జైపూర్‌లో నలుగురు మహిళలపై లైంగిక దాడి