Sonali phogat: సోనాలి ఫోగట్ మరణంపై వీడిన మిస్టరీ.. హత్యగా నిర్థారించిన గోవా పోలీసులు.. ఎలా జరగిందంటే

|

Aug 26, 2022 | 5:54 PM

సోనాలి ఫోగట్ మృతి కేసులో మిస్టరీ వీడింది. ఇప్పటి వరకు గుండెపోటుతో చనిపోయిందని ప్రాథమికంగా నిర్థారించగా.. పోస్టుమార్టం నివేదిక తర్వాత పూర్తిస్థాయి దర్యప్తు చేపట్టిన పోలీసులు..

Sonali phogat: సోనాలి ఫోగట్ మరణంపై వీడిన మిస్టరీ.. హత్యగా నిర్థారించిన గోవా పోలీసులు.. ఎలా జరగిందంటే
Sonali Phogat
Follow us on

Sonali Phogat Murder Case: సోనాలి ఫోగట్ మృతి కేసులో మిస్టరీ వీడింది. ఇప్పటి వరకు గుండెపోటుతో చనిపోయిందని ప్రాథమికంగా నిర్థారించగా.. పోస్టుమార్టం నివేదిక తర్వాత పూర్తిస్థాయి దర్యప్తు చేపట్టిన పోలీసులు ఆమెది హత్యగా నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. సోనాలి ఫోగట్ సన్నిహితులు ఆమెకు విష పదార్థాలను ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆమె విషకరమైన పదార్థాలను తీసుకోవడం ద్వారా చనిపోయినట్లుగా గోవా పోలీసులు వెల్లడించారు. ఆమెతో బలవంతంగా కెమికల్స్ ను తాగించిన తర్వాత ఆమె స్పృహ కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరుగుతోందని తెలిపారు. గోవా ఐజీ ఓంవీర్ సింగ్ బిష్ణోయ్ మీడియాతో మాట్లాడుతూ.. సోనాలి ఫోగట్ హత్యకు గురైనట్లు నిర్థరాంచామన్నారు. ఈకేసులో ఆమె సన్నిహితులు సుధీర్ సగ్వాన్‌, సుఖ్విందర్ వాసీలపై హత్యానేరం కింద కేసులు నమోదు చేసి.. అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. విచారణ జరుగుతుందని, నిందితులను న్యాయస్థానంలో హాజరుపర్చనున్నట్లు తెలిపారు. ఇద్దరు సన్నిహితుల్లో ఒకరు సోనాలి ఫోగట్ కు బలవంతంగా విషకరమైన రసాయనాలను తాగించారని.. ఆతర్వాత ఆమె ఆరోగ్యం క్షిణించిందన్నారు. ఈ రసాయనాలు తాగడం ద్వారానే ఆమె చనిపోయినట్లు నిర్థారణకు వచ్చినట్లు ఐజీ ఓంవీర్ సింగ్ బిష్ణోయ్ వెల్లడించారు.

ఇదిలా ఉండగా.. గోవాలో ఈనెల 23వ తేదీన హోటల్ గదిలో ఆరోగ్యం క్షిణించడంతో ఆమెను సమీపంలోని ఆసుప్రతికి తరలించారు. తొలుత సోనాలి ఫోగట్ గుండెపోటు కారణంగా మృతిచెందినట్లు పోలీసులు, వైద్యులు ప్రాథమికంగా నిర్థారించారు. అందరూ ఆమె గుండెపోటుతో మరణించిందని భావించారు. అయితే మంగళవారం రాత్రి గోవాకు చేరుకున్న సోనాలి ఫోగట్ కుటుంబ సభ్యులు.. ఆమెది గుండెపోటు కాదని.. హత్య అంటూ బుధవారం గోవా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఒక్కసారిగా సోనాలి ఫోగట్ మృతి కేసులో ఏం జరిగిందంటూ కలకలం రేగింది. సోనాలి ఫోగట్ తో పాటు ఆమె ఇద్దరి సన్నిహితులు ఉన్నారని.. వారే ఈహత్య చేశారంటూ కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీనిపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అయితే సోనాలి ఫోగట్ పోస్టు మార్టం రిపోర్టు ఆధారంగా ఆమెది గుండెపోటా, హత్య అనే నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంటుందని పోలీసులు తెలిపారు. చివరికి సోనాలి ఫోగట్ శరీరంపై గాయాలు ఉన్నట్లు నివేదిక రావడంతో హత్య కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

చివరికి సోనాలి ఫోగట్ కుటుంబ సభ్యులు అనుమానించిన నిందితులను అదుపులోకి తీసుకుని ప్రాథమికంగా విచారించి.. ఆమెది హత్యగా నిర్థారించారు. సోనాలి ఫోగట్ తో బలవంతంగా కెమికల్స్ తాగించారని పోలీసులు తెలిపారు. అయితే ఆమె కెమికల్స్ తాగడానికి నిరాకరించడంతో ఆమెను కొట్టారా అనే అనుమానం కలుగుతుంది. ఆమె శరీరంపై మొద్దుబారిన గాయాలు ఉండటం ఈఅనుమానాలకు బలం చేకూరుస్తోంది. మొత్తం మీద సోనాలి ఫోగట్ మృతిని పోలీసులు హత్యగా తేల్చడంతో తదుపరి విచారణ, చర్యలు ఎలా ఉంటాయనేది వేచి చూడాల్సి ఉంది.

మరోవైపు హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖతార్ సోనాలి ఫోగట్ కుటుంబ సభ్యులు లిఖిత పూర్వకంగా కోరితే సీబీఐ దర్యాప్తునకు ప్రభుత్వం తరపున కోరతామని ఇప్పటికే ప్రకటించారు. తాను గోవా పోలీసులు, ప్రభుత్వంతో ఈవిషయమై ఫాలో అప్ లో ఉన్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే.

ముగిసిన సోనాలి అంత్యక్రియలు:  బీజేపీ నాయకురాలు, టిక్ టాక్ స్టార్ సోనాలి ఫోగట్ అంత్యక్రియలు హిసార్ లో శుక్రవారం జరిగాయి. ఆమె కుమార్తె యశోధర ఆమె చితికి నిప్పంటించింది. రిషి నగర్ లోని శ్మశానవాటికలో సోనాలి ఫోగట్ అంత్యక్రియలు నిర్వహించి.. ఆమె కుటుంబ సభ్యులు, అభిమానులు ఆమెకు కన్నీటి వీడ్కోలు పలికారు.

Sonali Phogat

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..