Uttar Pradesh: బాలాజీ ఆలయంలో 8వ సారి పాము కాటు వేసింది అంటున్న వికాస్.. కల నిజం అవుతుందేమో అంటూ భయం

|

Jul 23, 2024 | 7:52 PM

ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ నివాసి వికాస్ ద్వివేది కథ ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది. గతంలో తాను 7 సార్లు పాము కాటుకు గురయ్యానని పేర్కొన్నాడు. తన కలలో పాము వచ్చిందని.. అది మొత్తం 9 సార్లు తనను కాటు వేసినట్లు చెప్పాడు. పాము తనని 9వ సారి కాటు వేసినప్పుడు తను చనిపోతానని వెల్లడించాడు. అంతేకాదు తన కల నిజం అవుతుందని నమ్మిన వికాస్ చాలా ఆందోళన చెంది ఈ సమస్య నుంచి బయటపడేందుకు రాజస్థాన్‌లోని మెహందీపూర్ బాలాజీ ఆలయానికి వెళ్లాడు.

Uttar Pradesh: బాలాజీ ఆలయంలో 8వ సారి పాము కాటు వేసింది అంటున్న వికాస్.. కల నిజం అవుతుందేమో అంటూ భయం
Vikas Dwivedi
Follow us on

ఉత్తరప్రదేశ్‌కు చెందిన వికాస్ ద్వివేది మరోసారి పాము కాటుకు గురయ్యాడు. తాను రాజస్థాన్‌లోని మెహందీపూర్ బాలాజీకి దర్శనం కోసం వెళ్లానని, అక్కడ మరోసారి పాము కాటు వేసిందని వికాస్ పేర్కొన్నాడు. వికాస్ చెప్పిన విషయం విన్న తర్వాత అతని పాము కాటు కథ, అతని కలలో ముందుగా చేసిన హెచ్చరిక మరోసారి నిష్ఫలమైంది. అయితే పాము కాటుకు గురైన వికాస్‌ను ఆస్పత్రికి తరలించలేదు.

ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ నివాసి వికాస్ ద్వివేది కథ ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది. గతంలో తాను 7 సార్లు పాము కాటుకు గురయ్యానని పేర్కొన్నాడు. తన కలలో పాము వచ్చిందని.. అది మొత్తం 9 సార్లు తనను కాటు వేసినట్లు చెప్పాడు. పాము తనని 9వ సారి కాటు వేసినప్పుడు తను చనిపోతానని వెల్లడించాడు. అంతేకాదు తన కల నిజం అవుతుందని నమ్మిన వికాస్ చాలా ఆందోళన చెంది ఈ సమస్య నుంచి బయటపడేందుకు రాజస్థాన్‌లోని మెహందీపూర్ బాలాజీ ఆలయానికి వెళ్లాడు.

తొమ్మిదవసారి కాటువేయడం వెనుక కథ ఏమిటి?

ఫతేపూర్‌కు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో పాము కాటుకు గురైనట్లు వికాస్ మళ్లీ చెప్పాడు. పాము కాటుకు గురైన వికాస్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లలేదు. తాను మూడుసార్లు పాము కాటుకు గురైన తర్వాత తనకు కల వచ్చిందని వికాస్ ఇప్పటికే వెల్లడించాడు. పాము తాను ఎనిమిది సార్లు కాటు వేసి.. తొమ్మిదో సారి కాటు వేసిన అనంతరం చనిపోతానని కలలో చెప్పిందని వెల్లడించారు. అయితే చాలా మంది ప్రజలు వికాష్ చెప్పిన విషయాన్ని నమ్మలేదు. మరికొందరు వికాష్ చెప్పిన విషయాన్ని అంగీకరించారు.

ఇవి కూడా చదవండి

వికాస్‌కి పాము అంటే ఫోబియా

మానవ జీవితంలో అనేక రకాల భయాలు ఉన్నాయి. వాటిని సైన్స్ సహాయంతో అర్థం చేసుకుంటే, ఫోబియా అని పిలుస్తారు. వికాస్ కేసు విన్న తర్వాత ఇది ఒక రకమైన పాము ఫోబియా కావచ్చునని నిపుణులు అంటున్నారు. ఈ వాదనపై కూడా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మెహందీపూర్ బాలాజీలో పాము కాటుకు గురైన వికాస్‌ను ఆసుపత్రికి తరలించకపోవడమే ఈ ప్రశ్నలకు ప్రధాన కారణం.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..