బంగారం అక్రమ రవాణాను నియంత్రించేందుకు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. స్మగ్లర్లు రోజుకో అవతారం ఎత్తుతున్నారు.. అయినప్పటికీ.. కస్టమ్స్, పోలీసులు స్మగ్లర్లకు దిమ్మతిరిగేలా షాక్ ఇస్తున్నారు.. బంగారం అక్రమ రవాణాకు సంబంధించిన వార్తలను ఎన్నో చూసుంటాం.. అయినా.. స్మగ్లర్లు బంగారం అక్రమ రవాణా కోసం పలు రకాలుగా ప్రయత్నిస్తూ అడ్డంగా దొరికిపోయిన సందర్భాలున్నాయి. తాజాగా, స్మగ్లర్లు ప్రైవేట్ పార్ట్స్ లో బంగారం ఉంచి అక్రమంగా రవాణా చేస్తూ దొరికిపోయారు.. ఈ ఘటన బెంగళూరు విమానాశ్రయంలో చోటుచేసుకుంది.. ఒక ముఖ్యమైన ఆపరేషన్ లో కస్టమ్స్ అధికారులు స్మగ్లర్ల ఆటకట్టించారు.
బెంగళూరు విమానాశ్రయంలో స్మగ్లింగ్‌కు ప్రయత్నించిన ముగ్గురు శ్రీలంక జాతీయులను అధికారులు అరెస్టు చేశారు. అక్రమం బంగారంతో భారత్ కు వస్తూ పట్టుబడ్డట్లు అధికారులు తెలిపారు.
కొలంబో నుంచి 6E-1168 విమానంలో ఆగష్టు 31న శ్రీలంక జాతీయులు ముగ్గురు కెంపెగౌడ ఇంటర్నేషనల్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ముందస్తు సమాచారంతో కస్టమ్స్ బృందం నిందితులను అదుపులోకి తీసుకుంది. అనంతరం చెక్ చేయగా.. పురీషనాళంలో బంగారాన్ని గుర్తించారు.. పేస్ట్ రూపంలో ప్రైవేట్ పార్ట్స్ లో బంగారాన్ని దాచిపెట్టారు.
అనంతరం వారిని అదుపులోకి తీసుకుని వైద్యలు పర్యవేక్షణలో బంగారాన్ని వెలికితీశారు. స్వాధీనం చేసుకున్న బంగారం 1,670.92 గ్రాములు ఉందని.. మార్కెట్ విలువ ప్రకారం సుమారు రూ.కోటి 20 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. బంగారాన్ని జప్తు చేసి కేసు నమోదుచేశామని.. ఈ ఘటనపై దర్యప్తు చేస్తున్నామని.. కస్టమ్స్ విభాగం పేర్కొంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..