రాజస్తాన్ రాజకీయ సంక్షోభం ముగిసినట్టేనా ? ఇంతకాలం ఉప్పు, నిప్పులా ఉన్న సీఎం అశోక్ గెహ్లాట్, అసమ్మతి నేత సచిన్ పైలట్ ఇద్దరూ ఒక్కసారిగా సయోధ్యతో కలిసిపోయారు. గురువారం సాయంత్రం తన నివాసానికి వచ్చిన సచిన్ ని గెహ్లాట్ సాదరంగా ఆహ్వానించారు. ఆప్యాయంగా ఆయనతో చేతులు కలిపారు. ఇన్నాళ్ల తరువాత మొట్టమొదటిసారిగా ఇద్దరూ ఒకచోట ముసిముసి నవ్వులు నవ్వుతూ కనిపించారు.’మర్చిపోద్దాం, క్షమించేద్దాం అని గెహ్లాట్ ఈ ఉదయం మళ్ళీ ట్విటర్ లో ఏ క్షణాన ట్వీట్ చేశారో గానీ.. ఆ దిశగానే పరిణామాలు సాగాయి. అసలు తమ మధ్య ఏ వివాదమూ రేగనట్టుగానే వారు వ్యవహరించారు. సంక్షోభ పరిష్కారానికి రాజీకి రావలసిందిగా కాంగ్రెస్ అధిష్టానం సచిన్ పైలట్ కి మళ్ళీ మళ్ళీ చేసిన బోధన…. ఫలితం ఇచ్చినట్టుగానే కనిపిస్తోంది..శుక్రవారం రాష్ట్ర శాసన సభ సమావేశమవుతున్న తరుణంలో ఇక తదుపరి ఎపిసోడ్ ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.
గెహ్లాట్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని రేపటి సభలో ప్రవేశపెట్టాలని బీజేపీ ప్రకటించిన నేపథ్యంలో ఈ సరికొత్త పరిణామం ఎలాంటి ప్రభావం చూపనుందో?
Jaipur: Congress MLAs attend Legislature Party meeting at Chief Minister Ashok Gehlot’s residence. Sachin Pilot is also present. pic.twitter.com/ou8i9bf8t5
— ANI (@ANI) August 13, 2020