Nipha Virus: మరోసారి నిఫా వైరస్‌ కలకలం… ఆ ఆరు జిల్లాలకు హై అలర్ట్‌ జారీ

మరోసారి కేరళలో నిఫా వైరస్‌ కలకలం రేపుతోంది. రెండు రోజుల్లో ఇద్దరు మృతి చెందారు. దీంతో ఆరు జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించింది కేరళ సర్కార్‌. పాలక్కాడ్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి నిపా వైరస్ సోకినట్లు అనుమానం రావడంతో కాంటాక్ట్ ట్రేసింగ్, క్షేత్రస్థాయి నిఘాను వేగవంతం చేసింది ప్రభుత్వం. నిర్ధారణ కోసం...

Nipha Virus: మరోసారి నిఫా వైరస్‌ కలకలం... ఆ ఆరు జిల్లాలకు హై అలర్ట్‌ జారీ
Nipha Virus

Updated on: Jul 17, 2025 | 8:38 AM

మరోసారి కేరళలో నిఫా వైరస్‌ కలకలం రేపుతోంది. రెండు రోజుల్లో ఇద్దరు మృతి చెందారు. దీంతో ఆరు జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించింది కేరళ సర్కార్‌. పాలక్కాడ్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి నిపా వైరస్ సోకినట్లు అనుమానం రావడంతో కాంటాక్ట్ ట్రేసింగ్, క్షేత్రస్థాయి నిఘాను వేగవంతం చేసింది ప్రభుత్వం. నిర్ధారణ కోసం పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి శాంపిల్స్ పంపించింది. పాలక్కాడ్, మలప్పురం, కోజికోడ్, కన్నూర్, వయనాడ్, త్రిస్సూర్‌లోని ఆసుపత్రులను అలర్ట్‌ చేసింది ఆరోగ్యశాఖ. ఎన్సెఫాలిటిస్, జ్వరం, నిపాను పోలిన లక్షణాలు ఉన్న పేషెంట్ల వివరాలు చెప్పాలని ఆదేశించింది.

ఏటా కేరళలో నిఫా వైరస్‌ కేసులు బయటపడుతున్నాయి. నిఫా అనేది జంతువుల నుంచి, ముఖ్యంగా గబ్బిలాలు, పందుల ద్వారా మనుషులకు వ్యాపించే ఒక వైరల్ వ్యాధి. ఇది సోకిన వారిలో తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు తీవ్ర శ్వాసకోశ సమస్యలకు దారితీస్తుంది.

నిఫా అనేది జంతువుల నుంచి, ముఖ్యంగా గబ్బిలాలు, పందుల ద్వారా మనుషులకు వ్యాపించే ఒక వైరల్ వ్యాధి. ఇది సోకిన వారిలో తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులతో పాటు మెదడువాపు లేదా తీవ్ర శ్వాసకోశ సమస్యలకు దారితీస్తుంది. దీనికి నిర్దిష్టమైన చికిత్స లేకపోవడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని అత్యంత ప్రమాదకరమైన వ్యాధుల్లో ఒకటిగా పరిగణిస్తోంది.

వైరస్‌ వ్యాప్తిపై నిఘాను మరింత పెంచాలని అధికారులకు సూచించారు. ప్రతి ఏటా కేరళలో నిఫా వైరస్‌ కేసులు బయటపడుతున్నాయి. రాష్ట్రం లోని అన్ని ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కొన్ని ప్రాంతాల్లో కంటేన్మెంట్‌ జోన్‌లుగా ప్రకటించాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉంది.

కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ఇచ్చిన తాజా అప్‌డేట్ ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 675 మంది నిపా కాంటాక్ట్ జాబితాలో ఉన్నారు. వీరిలో 178 మంది పాలక్కాడ్ జిల్లాలో వెలుగు చూసిన రెండవ నిపా కేసుతో కాంటాక్ట్‌ అయి ఉన్నారు. ప్రస్తుతం మలప్పురం జిల్లాలో 210, పాలక్కాడ్‌లో 347, కోజికోడ్‌లో 115, ఎర్నాకుళంలో ఇద్దరు మరియు త్రిస్సూర్‌లో ఒకరు ఉన్నారు.