యూపీలో చెలరేగిన ఘర్షణలు.. ఆరుగురు మృతి

| Edited By:

Dec 21, 2019 | 6:08 AM

పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ.. దేశంలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా యూపీ, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శుక్రవారం యూపీలో చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ.. యూపీలో జరిగిన ఘర్షణల్లో ఆరుగురు పౌరులు మరణించారని పోలీసులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు యూపీలో ఈ ఆందోళనల కారణంగా మరణించిన వారి సంఖ్య ఏడుకు […]

యూపీలో చెలరేగిన ఘర్షణలు.. ఆరుగురు మృతి
Follow us on

పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ.. దేశంలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా యూపీ, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శుక్రవారం యూపీలో చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ.. యూపీలో జరిగిన ఘర్షణల్లో ఆరుగురు పౌరులు మరణించారని పోలీసులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు యూపీలో ఈ ఆందోళనల కారణంగా మరణించిన వారి సంఖ్య ఏడుకు చేరింది. కాగా, శుక్రవారం మరణించిన ఆరుగురు ఘర్షణల కారణంగానే మరణించారని.. పోలీసులు కాల్పులు జరపలేదని.. యూపీ డీజీపీ స్పష్టం చేశారు. తాము ఒక్క బుల్లెట్‌ కూడా కాల్చలేదని తెలిపారు.

కాగా, పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం.. బిజ్నోర్‌లో ఇద్దరు, సంభాల్‌, ఫిరోజాబాద్‌, మీరట్‌, కాన్పూర్‌లో ఒక్కరేసి ఆందోళనకారులు మరణించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇతర ప్రాంతాల్లో కూడా ఆందోళనకారులు రెచ్చిపోయారు. పోలీసులపై రాళ్లు రవ్వుతూ.. దాడులకు పాల్పడ్డారు. పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటుగా.. పలు చోట్ల 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు.