AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిమజ్జన వేడుకల్లో అపశృతి.. ఆరుగురు చిన్నారులు మృతి

కర్నాటక గణేష్ నిమజ్జన వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. కోలార్ జిల్లా క్యేశంబల్లా సమీపంలో గణేష్ నిమజ్జనాలు జరుగుతున్నాయి. అయితే వినాయకడిని నిమజ్జనం చేసేందుకు వెళ్లి ఆరుగురు చిన్నారులు చెరువులో పడి చనిపోయారు. మరదగట్టి గ్రామంలో ఈ ఘటన జరిగింది. మృతుల్లో నలుగురు బాలికలు, ఇద్దరు బాలురు ఉన్నారు. మృతులంతా పన్నెండేళ్లలోపు వారేనని పోలీసులు తెలిపారు. మృతులను రక్షిత, తేజస్విని, వీణ, వైష్ణవి, రోహిత్, ధనుష్‌గా గుర్తించారు. వినాయకుడిని నిమజ్జనం చేసేందుకు ఏడుగురు చిన్నారులు గ్రామంలో ఉన్న చెరువు […]

నిమజ్జన వేడుకల్లో అపశృతి.. ఆరుగురు చిన్నారులు మృతి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 10, 2019 | 11:54 PM

Share

కర్నాటక గణేష్ నిమజ్జన వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. కోలార్ జిల్లా క్యేశంబల్లా సమీపంలో గణేష్ నిమజ్జనాలు జరుగుతున్నాయి. అయితే వినాయకడిని నిమజ్జనం చేసేందుకు వెళ్లి ఆరుగురు చిన్నారులు చెరువులో పడి చనిపోయారు. మరదగట్టి గ్రామంలో ఈ ఘటన జరిగింది. మృతుల్లో నలుగురు బాలికలు, ఇద్దరు బాలురు ఉన్నారు. మృతులంతా పన్నెండేళ్లలోపు వారేనని పోలీసులు తెలిపారు. మృతులను రక్షిత, తేజస్విని, వీణ, వైష్ణవి, రోహిత్, ధనుష్‌గా గుర్తించారు. వినాయకుడిని నిమజ్జనం చేసేందుకు ఏడుగురు చిన్నారులు గ్రామంలో ఉన్న చెరువు దగ్గరకు వెళ్లారు. అయితే వినాయకుడిని చెరువులో వేసే క్రమంలో ముగ్గురు చిన్నారులు ఆ చెరువులో పడ్డారు. అయితే వారిని కాపాడేందుకు మరో ముగ్గురు అందులోకి దూకారు. అయితే వారు కూడా అందులో మునిగిపోతుండటం చూసి.. అక్కడే ఉన్న మరో బాలుడు గట్టిగా అరుస్తుండటం గమనించిన స్థానికులు అక్కడికి చేరుకున్నారు. చెరువులో మునిగిపోయిన చిన్నారులను స్థానికులు బయటకు తీసి.. వెంటనే వారిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అప్పటి కే వారు ప్రాణాలు విడిచారని డాక్టర్లు ధృవీకరించారు. దీంతో మరదగట్టి గ్రామంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి. చిన్నారుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఒకేసారి ఆరుగురు పిల్లలు చనిపోవడంతో గ్రామస్తులు కంటతడి పెట్టారు.

Follow Us
డ్రై క్లీనర్ మంత్లీ ఇన్‌కం.. రూ.2 లక్షలు నెట్టింట వైరల్‌గా పోస్ట్
డ్రై క్లీనర్ మంత్లీ ఇన్‌కం.. రూ.2 లక్షలు నెట్టింట వైరల్‌గా పోస్ట్
రైతన్నలకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్.. అకౌంట్లోకి బోనస్ డబ్బులు
రైతన్నలకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్.. అకౌంట్లోకి బోనస్ డబ్బులు
'ఫంకీ' సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ యంగ్ హీరో ఎవరో తెలుసా?
'ఫంకీ' సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ యంగ్ హీరో ఎవరో తెలుసా?
గిన్నిస్ రికార్డు సృష్టించిన భారీ పాము
గిన్నిస్ రికార్డు సృష్టించిన భారీ పాము
ఆదివాసీల అమృతం.. ఇప్పపువ్వు లడ్డూ ఇంట్లో ఎలా చేయాలంటే?
ఆదివాసీల అమృతం.. ఇప్పపువ్వు లడ్డూ ఇంట్లో ఎలా చేయాలంటే?
వ్యాధులను తొలగించే ‘మరకత లింగం’.. హైదరాబాద్ శివారులోనే ఈ శివాలయం
వ్యాధులను తొలగించే ‘మరకత లింగం’.. హైదరాబాద్ శివారులోనే ఈ శివాలయం
నీళ్లా.. అని లైట్‌ తీసుకోకండి.. విషయం తెలిస్తే షాకే
నీళ్లా.. అని లైట్‌ తీసుకోకండి.. విషయం తెలిస్తే షాకే
అదృష్టం, ఆనందం కలిసి రావాలంటే ఇంట్లో ఈ మొక్కలు పెంచండి
అదృష్టం, ఆనందం కలిసి రావాలంటే ఇంట్లో ఈ మొక్కలు పెంచండి
ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో 32 పేజీల బుక్‌లెట్‌.. కొత్త మార్పులు ఇవే
ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో 32 పేజీల బుక్‌లెట్‌.. కొత్త మార్పులు ఇవే
ఇలా చేస్తే చాలు కిలోల కొద్ది వెల్లుల్లి పొట్టును సులభంగా తీయవచ్చు
ఇలా చేస్తే చాలు కిలోల కొద్ది వెల్లుల్లి పొట్టును సులభంగా తీయవచ్చు