
స్మగ్లింగ్.. స్మగ్లింగ్.. ఎటు చూసినా ఇదే మాట వినిపిస్తోంది. ఢిల్లీ టు గల్లీ.. సీపోర్ట్ టు ఎయిర్ రూట్.. అంతా స్మగ్లింగ్ మయంగా మారుతోంది. కేరళ బంగారం స్మగ్లింగ్‌కు అడ్డగా మారుతోంది. హాలీవుడ్ రేంజ్‌లో థ్రిల్లర్ సీక్వెన్స్ పండించి అడ్డంగా దొరికిపోయారు గోల్డ్ స్మగ్లర్స్. సినీ ఫక్కీలో బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ.. సీమాంతరాలను దాటించేయాలని చూశారు. కాని కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పి తప్పించుకోలేకపోయారు. దుబాయ్ నుంచి అక్రమంగా తరలిస్తున్న బంగారం మున్నియూర్‌లో పట్టుబడింది. 6,300 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న డీఆర్‌ఐ.. ఘటనలో ఆరుగురిని అరెస్టు చేశారు. పోస్టాఫీసు ద్వారా అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. తెప్పు పెట్టెతోపాటు ఎలక్ట్రానిక్ పరికరాల్లో బంగారాన్ని దాచి స్మగ్లింగ్ చేశారు.
కోజికోడ్‌కు చెందిన షిహాబ్, కున్నమంగళానికి చెందిన జజీల్, మున్నియూర్‌కు చెందిన అస్య, మలప్పురానికి చెందిన యాసిర్, రనీష్, రవూఫ్‌లను అరెస్టు చేశారు. కస్టమ్స్ తనిఖీల అనంతరం కొచ్చి నుంచి వచ్చిన పార్శిళ్లలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
మలప్పురంలోని మున్నియూర్‌లో పోస్టాఫీసు ద్వారా అక్రమంగా తరలిస్తున్న బంగారం స్వాధీనం. దుబాయ్ నుంచి వచ్చిన పార్శిల్‌లో 6.3 కిలోల బంగారాన్ని డీఆర్‌ఐ గుర్తించింది. ఈ ఘటనలో కోజికోడ్‌కు చెందిన ఆరుగురిని అరెస్టు చేశారు. మలప్పురానికి చెందిన యాసిర్, రనీష్, రవూఫ్, కున్నమంగళానికి చెందిన జజీల్, కోజికోడ్‌కు చెందిన షిహాబ్, మున్నియూర్‌కు చెందిన ఆస్యలను అరెస్టు చేశారు.
కస్టమ్స్ తనిఖీల అనంతరం కొచ్చి నుంచి వచ్చిన పార్శిళ్లలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కస్టోస్ అధికారుల అండతోనే బంగారం అక్రమంగా తరలిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. కస్టమ్స్ అధికారుల పాత్రపై కూడా డీఆర్‌ఐ విచారణ జరుపుతోంది. తెప్పు పెట్టెతోపాటు ఎలక్ట్రానిక్ పరికరాల్లో బంగారాన్ని దాచి అక్రమంగా తరలిస్తు దొరికి పోయారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం