ఢిల్లీలోనూ ఎన్నార్సీ.. గళమెత్తిన బీజేపీ

|

Aug 31, 2019 | 3:42 PM

అసోంలో మాదిరే ఢిల్లీలోనూ ఎన్నార్సీని నిర్వహించాలని ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ డిమాండ్ చేశారు. అక్రమంగా నగరంలో ఉంటున్నవారిని గుర్తించేందుకు ఇది తప్పనిసరి అన్నారు. ఈ నగరంలో పరిస్థితి ప్రమాదకరంగా ఉందని, ఇందుకు కారణం ఇలాంటి అక్రమవాసులేనని ఆయన పేర్కొన్నారు. సమయం వచ్చినప్పుడు ఎన్నార్సీని అమలు చేస్తామన్నారు. ఢిల్లీ అసెంబ్లీకి వచ్ఛే ఏడాది ఎన్నికలు జరగనున్న సందర్భంలో తివారీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈయన గతంలోనూ ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ […]

ఢిల్లీలోనూ ఎన్నార్సీ.. గళమెత్తిన బీజేపీ
Follow us on

అసోంలో మాదిరే ఢిల్లీలోనూ ఎన్నార్సీని నిర్వహించాలని ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ డిమాండ్ చేశారు. అక్రమంగా నగరంలో ఉంటున్నవారిని గుర్తించేందుకు ఇది తప్పనిసరి అన్నారు. ఈ నగరంలో పరిస్థితి ప్రమాదకరంగా ఉందని, ఇందుకు కారణం ఇలాంటి అక్రమవాసులేనని ఆయన పేర్కొన్నారు. సమయం వచ్చినప్పుడు ఎన్నార్సీని అమలు చేస్తామన్నారు. ఢిల్లీ అసెంబ్లీకి వచ్ఛే ఏడాది ఎన్నికలు జరగనున్న సందర్భంలో తివారీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈయన గతంలోనూ ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ కామెంట్స్ పై మహిళా కాంగ్రెస్ విభాగం భగ్గుమంది. ‘ మీరు బీహార్ లోని కైమూర్ లో జన్మించారు. యూపీలోని వారణాసిలో చదివారు. మహారాష్ట్రలోని ముంబైలో పని చేశారు. గోరఖ్ పూర్ ఎన్నికల్లో పోటీ చేశారు.. మళ్ళీ ఢిల్లీ ఎన్నికల్లోనూ పోటీ చేశారు. ఇప్పుడు అక్రమ వలసదారులను ఢిల్లీ నుంచి తరిమేయాలంటున్నారు.. ఏమిటిది ‘ అని మహిళా కాంగ్రెస్ విభాగం ట్వీట్ చేసింది. కాగా-దేశవ్యాప్తంగా ఉన్న ‘ చొరబాటుదారులను ‘ దేశం నుంచి తరిమివేసేందుకు తమ పార్టీ కట్టుబడి ఉందని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఈ ఏడాది ఆరంభంలో తమ పార్టీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రకటించారు. గత ఏడాది సెప్టెంబరులో హైదరాబాద్ ను విజిట్ చేసిన సందర్భంలోనూ ఆయన నగరంలోని అక్రమ బంగ్లాదేశీయులను పంపివేసేందుకు ఎన్నార్సీ వంటి ప్రక్రియ అవసరమని పేర్కొన్నారు. తాజాగా… తెలంగాణలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ఇలాంటి ప్రకటనే చేసి ఈ అంశాన్ని మరింత వేడెక్కించారు.