Prajwal Revanna: బెంగళూరు కోర్టులో ప్రజ్వల్‌కు ఎదురుదెబ్బ.. రావడమే అలస్యం అరెస్ట్‌కు రంగం సిద్ధం!

|

May 30, 2024 | 7:32 AM

లైంగిక దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ భారత్‌కు వస్తున్నారు. ఈనెల 31న సిట్ విచారణ కోసం జర్మనీ నుంచి బెంగళూరుకి బయలు దేరనున్నారు. భారత్‌కు చేరుకోగానే ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ అరెస్ట్‌కు రంగం సిద్దమయ్యింది. సిట్‌ విచారణకు హాజరవుతానని వీడియో సందేశాన్ని విడుదల చేశారు ప్రజ్వల్‌. బెంగళూర్‌ కోర్టులో ప్రజ్వల్‌ రేవణ్ణ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు తిరస్కరించింది.

Prajwal Revanna: బెంగళూరు కోర్టులో ప్రజ్వల్‌కు ఎదురుదెబ్బ.. రావడమే అలస్యం అరెస్ట్‌కు రంగం సిద్ధం!
Prajwal Revanna
Follow us on

లైంగిక దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ భారత్‌కు వస్తున్నారు. ఈనెల 31న సిట్ విచారణ కోసం జర్మనీ నుంచి బెంగళూరుకి బయలు దేరనున్నారు. భారత్‌కు చేరుకోగానే ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ అరెస్ట్‌కు రంగం సిద్దమయ్యింది. సిట్‌ విచారణకు హాజరవుతానని వీడియో సందేశాన్ని విడుదల చేశారు ప్రజ్వల్‌. బెంగళూర్‌ కోర్టులో ప్రజ్వల్‌ రేవణ్ణ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు తిరస్కరించింది.

లైంగిక దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్‌ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఎట్టకేలకు రేపు భారత్ కు రానున్నారు. ఇవాళ జర్మనీ నుంచి బయలుదేరి బెంగళూరుకు వస్తారు. భారత్‌కి రాగానే అరెస్ట్ చేస్తారన్న సమాచారంతో బెంగళూరు కోర్టులో ప్రజ్వల్‌ రేవణ్ణ ముందస్తు బెయిల్ పిటిషన్‌ వేశారు. రేవణ్ణ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. అయితే ఇప్పటికే ఈ కేసులో మే 31 ఉదయం 10గంటలకు సిట్ అధికారుల ముందు హాజరవుతానంటూ ప్రజ్వల్ ఇటీవల.. ఓ వీడియో విడుదల చేశారు. కేసు విషయంలో తాను పోలీసులకు పూర్తి స్థాయిలో సహకరిస్తానని స్పష్టం చేశారు. తనకు న్యాయ వ్యవస్థపైన, చట్టాలపైన నమ్మకం ఉందన్న ప్రజ్వల్.. తనపై రాజకీయ కుట్రలో భాగంగా తప్పుడు కేసు పెట్టారంటూ ఆరోపించారు.

ఏప్రిల్ 26న పోలింగ్‌ ముగిసినప్పుడు తనపై ఎలాంటి కేసు లేదన్నారు. తర్వాత రెండు, మూడు రోజులకు ఆరోపణలు వచ్చాయన్నారు ప్రజ్వల్. ఎన్డీయే కూటమి అభ్యర్థిగా హాసన నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ప్రజ్వల్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలతోపాటు, ఆయనకు సంబంధించిన కొన్ని అభ్యంతరకర వీడియోలు వెలుగులోకి వచ్చాయి. బాధిత మహిళలు ఒక్కొక్కరిగా బయటకు వచ్చి ఆయనపై ఫిర్యాదులు చేశారు. దాంతో కర్ణాటకలో ఆయనపై అత్యాచారం, కిడ్నాప్‌ కేసు నమోదైంది. ఏప్రిల్‌ 27న ప్రజ్వల్‌ దేశం విడిచి జర్మనీ వెళ్లిపోయారు.

ప్రజ్వల్‌ విదేశాలకు వెళ్లి నెలరోజులైనా.. ఆయన ఆచూకీని ప్రత్యేక దర్యాప్తు బృందం గుర్తించలేకపోయింది. నాలుగుసార్లు నోటీసులు, ఒక అరెస్టు వారెంటు, బ్లూ కార్నర్, రెడ్‌ కార్నర్‌ నోటీసులు జారీ అయ్యాయి. పాస్‌పోర్టు రద్దు చేసేందుకు కేంద్ర విదేశాంగ శాఖ చర్యలు చేపట్టింది. మరోవైపు విచారణకు హాజరు కావాలని మాజీ ప్రధాని హెచ్‌డీ దేవేగౌడ, ప్రజ్వల్ తండ్రి హెచ్‌డీ రేవణ్ణ, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి, బహిరంగ విన్నవించిన నెల రోజుల తర్వాత ప్రజ్వల్‌ స్పందించారు. తన ఆచూకీ చెప్పనందుకు.. తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, జేడీఎస్‌ శ్రేణులకు ప్రజ్వల్‌ క్షమాపణలు చెప్పారు. ఇప్పుడు కేసు విచారణను ఎదుర్కొవడానికి భారత్‌ వస్తుండడంతో ప్రజ్వల్ కేసు విషయంలో ఉత్కంఠ నెలకొంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..