PM Modi: భాషా వివాదంపై తమిళనాడు సీఎం స్టాలిన్‌కు ప్రధాని మోదీ చురకలు..!

|

Apr 06, 2025 | 5:56 PM

మాతృ భాష తమిళం అంశంలో తమిళ రాజకీయ నేతల తీరును భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తప్పు పట్టారు. తనకు రాసిన లేఖలలో వారు మాతృ భాష తమిళంలో సంతకం చేయడం లేదన్నారు. పేద విద్యార్థుల సౌలభ్యం కోసం స్టాలిన్‌ ప్రభుత్వం వైద్య విద్యను తమిళంలో ప్రారంభించాలని ప్రధానమంత్రి మోదీ సూచించారు.

PM Modi: భాషా వివాదంపై తమిళనాడు సీఎం స్టాలిన్‌కు ప్రధాని మోదీ చురకలు..!
Pm Modi In Tamil Nadu
Follow us on

మాతృ భాష తమిళం అంశంలో తమిళ రాజకీయ నేతల తీరును భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తప్పు పట్టారు. తనకు రాసిన లేఖలలో వారు మాతృ భాష తమిళంలో సంతకం చేయడం లేదన్నారు. పేద విద్యార్థుల సౌలభ్యం కోసం స్టాలిన్‌ ప్రభుత్వం వైద్య విద్యను తమిళంలో ప్రారంభించాలని మోదీ సూచించారు.

తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం త్రిభాషా విధానాన్ని వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో రామేశ్వరం పర్యటనలో ప్రధాని మోదీ సీఎం స్టాలిన్‌కు చురకలు అంటించారు. తమిళనాడు నేతల తీరు తనను ఆశ్చర్యానికి గురిచేస్తుందని.. వారు తనకు తరచూ లేఖలు రాస్తుంటారని.. కానీ ఒక్కరు కూడా మాతృభాష తమిళంలో సంతకం చేయరని అన్నారు తమిళ భాషను గౌవరించాలని అందరూ తమిళంలో సంతకాలు చేయాలని తమిళనాడు రాజకీయ నేతలకు ప్రధాని మోదీ సూచించారు.

చాలా రాష్ట్రాలు వైద్యవిద్యను మాతృభాషలో అందిస్తున్నాయని దీంతో ఇంగ్లీష్‌ చదవలేని పేద విద్యార్థులు సైతం మాతృభాషలో ఎంబీబీఎస్‌ పూర్తి చేస్తున్నారని ప్రధాని తెలిపారు. వైద్య విద్యను తమిళ భాషలో అందించాలని.. తద్వారా పేదలకు ప్రయోజనం చేకూరుతుందని డీఎంకే ప్రభుత్వానికి ప్రధాని మోదీ సూచించారు.

తమిళనాడుకు కేంద్రం నిధులు పెంచినప్పటికీ.. కొందరు నిరాశే వ్యక్తం చేస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు. యూపీఏతో పోలిస్తే ఎన్టీఏ పాలనలో మూడింతల నిధులు తమిళనాడుకి ఇచ్చామన్నారు. రాష్ట్రానికి రైల్వే ప్రాజెక్టుల కోసం గతంలో కంటే ఏడు రెట్లు నిధులు పెంచామని 2014 వరకు రైల్వే ప్రాజెక్టుల కోసం రూ.900 కోట్లు కేటాయిస్తే.. ఎన్డీఏ ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే రూ.600కోట్లు కేటాయించిందన్నారు ప్రధాని మోదీ.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..