టీవీ నటి శ్వేతా తివారీకి కోవిడ్ పాజిటివ్

టీవీ నటి శ్వేతా తివారీ తనకు కోజిటివ్ పాజిటివ్ అని ప్రకటించింది. టీవీ సీరియల్ 'మేరే డాడ్ కీ దుల్హన్' లో ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈమె-తనకు ఈ నెల 16 న కరోనా వైరస్ లక్షణాలు కనబడ్డాయని, టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ అని రిపోర్టు వచ్చిందని తెలిపింది.

టీవీ నటి శ్వేతా తివారీకి కోవిడ్ పాజిటివ్

Edited By:

Updated on: Sep 24, 2020 | 10:29 AM

టీవీ నటి శ్వేతా తివారీ తనకు కోజిటివ్ పాజిటివ్ అని ప్రకటించింది. టీవీ సీరియల్ ‘మేరే డాడ్ కీ దుల్హన్’ లో ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈమె-తనకు ఈ నెల 16 న కరోనా వైరస్ లక్షణాలు కనబడ్డాయని, టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ అని రిపోర్టు వచ్చిందని తెలిపింది. వచ్ఛే నెల 1 వరకు సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉంటున్నానని పేర్కొంది. ప్రస్తుతం తనకు ‘టఫ్ టైం’ (గడ్డు కాలం) నడుస్తోందని శ్వేత వెల్లడించింది. నటుడు అభినవ్ కోహ్లీని పెళ్లి చేసుకున్న ఈమెకు  మూడేళ్ళకొడుకు ఉన్నాడు. ఈమె టీనేజ్ కూతురు ఫలక్  కూడా టీవీ సీరియల్స్ లో నటిస్తోంది. ఇక ‘మేరే డాడ్ కీ దుల్హన్’ సీరియల్ నటుడు వరుణ్ బడోలా కూడా కోవిడ్ బారిన పడ్డాడు. తన సెకండ్ టెస్ట్ ఫలితాల అనంతరం మళ్ళీ టీవీ సెట్స్ లో అడుగుపెట్టనున్నాడు.

Loading...
Unable to load recommendations.
Follow Us