తమిళనాడులోని అత్తివరదర్ ఆలయంలో అపశృతి చోటుచేసుకుంది. భారీ వర్షం కారణంగా షార్ట్ సర్క్యూట్ జరిగింది. దీంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. క్యూ లైన్లో ఉన్న భక్తులు భయాందోళనలకు గురయ్యారు. అయితే వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. భక్తులను దూరంగా పంపించేశారు. అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి ప్రమాదం కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.